Krishnam Raju: కృష్ణంరాజు 'రెబల్ స్టార్'గా జేజేలు అందుకోకముందు ఆయన హీరోగా నటించిన అనేక చిత్రాలలో సాఫ్ట్ రోల్స్ లోనే కనిపించారు. అందుకు కారణం అంతకు ముందు ఆయన పలు సినిమాల్లో విలన్ గానూ, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ కనిపించి, జనాన్ని జడిపించడమే!
కృష్ణంరాజు ఎందరు కథానాయికలతో నటించినా, ఆయనకు అచ్చివచ్చిన నాయిక వాణిశ్రీ అనే చెప్పాలి. వాణిశ్రీతో కలసి కృష్ణంరాజు అంతకు ముందు పలు చిత్రాలలో నటించారు. కొన్ని చిత్రాలలో ఆమెను రేప్ చేయబోయే విలన్ గానూ కనిపించారు. అయితే వారిద్దరూ కలసి నవలా చిత్రం `జీవనతరంగాలు`లో అక్క-త�