టాలీవుడ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్ అవడంతో ఆయన కెరీర్ ఇంకా అయిపోయింది అనే మాటలు వినిపించాయి. ఈ సారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నాడు. అందులో భాగంగానే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో మల్టిఫుల్ లాంగ్వేజెస్ లో వస్తున్న ఈ సినిమాలో ఇప్పుడు క్యాస్టింగ్‌ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్.
ఇప్పటికే సీనియర్ నటి టబును ఈ సినిమాలో ఆన్ బోర్డ్ చేసారు మేకర్స్. ఇక ఇప్పుడు తాజాగా మరోక కన్నడ స్టార్ హీరోను తీసుకున్నారు మేకర్స్. గతంలో నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో వచ్చిన వీరసింహ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దునియా విజయ్ ఇప్పుడు పూరి సినిమాలో నటిస్తున్నాడని అఫీషియల్ గా ప్రకటించారు పూరి. విజయ్ సేతుపతి తో దునియా విజయ్ తలపడే సీన్స్ ఎలా ఉంటాయోనని ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని చార్మి కౌర్‌తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ జగన్నాథ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాకు ‘బెగ్గర్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. వరుస ప్లాప్ లతో సతమతమవుతన్న పూరి కోలీవుడ్ స్టార్ సేతుపతితో చేయబోయే సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.