NTV Telugu Site icon

kanguva : సూపర్ స్టార్ అంటే ఆయన మాత్రమే..

Suriya

Suriya

తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు శివ తెరకెక్కించిన చిత్రం కంగువ. బాలీవుడ్ అందాల తార దిశా పఠాని హీరొయిన్ గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా నవంబరు 14న వరల్డ్ వైడ్ కు రెడీ గా ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉంది యూనిట్, సూర్యతో పాటు దర్శకుడు శివ, దిశా పఠాని, బాబీ డియోల్ నార్త్ లోని యూనివర్సిటీలు, మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Also Read : Icon Star : పుష్ప -2 కోసం నేషనల్ మీడియా హైదరాబాద్ రాక

ఈ నేపథ్యంలో సూర్య బాలీవుడ్ లో ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు. ఆ సమావేశంలో ఓ జర్నలిస్ట్ సూర్య ను మీరు కూడా ఒక సూపర్ స్టార్. అని మాట్లాడుతుండగా వెంటనే కలుగజేసుకున్న సూర్య మాట్లాడుతూ సూపర్ స్టార్ అనేది ఒకే ఒక్కరు. అది మన సూపర్ స్టార్ రజనీ సార్ మాత్రమే. ఆ ట్యాగ్ వేరే ఎవరికి లేదు అది ఆయనయూ మాత్రమే అని బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సూర్య హుందతనానికి రజనీ ఫ్యాన్స్ సూర్యను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కాగా నేడు కంగువ యూనిట్ తెలుగు ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ రానుంది. AMB సినిమలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. టాలీవుడ్ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీస్ ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తోంది. కండువ తమిళ సినిమాకు బాహుబలి లాంటిది అని టీమ్ నమ్మకంగా చెప్తోంది.

Show comments