NTV Telugu Site icon

Kanguva : కంగువ స్ట్రీమింగ్ పార్టనర్ ఎవరో తెలుసా..?

Kanguva

Kanguva

తమిళ స్టార్‌ హీరో సూర్య హీరోగా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. నేడు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో విడుదలైంది. పీరియాడికల్‌ యాక్షన్‌ ఫిలింగా తెరకెక్కిన ఈ సినిమాకు వీరం, విశ్వాసం, వివేకం వంటి హిట్ చిత్రాల శివ దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పటాని , బాలీవుడ్ స్టార్‌ నటుడు బాబీ డియోల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో నిర్మాత జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌లు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.

Also Read : Thaman S : తమన్ కు కృతఙ్ఞతలు తెలిపిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

కాగా కంగువా డిజిటల్ పార్టనర్ ను ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగొలు చేసింది ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్. ఎంత ధరకు డీల్ క్లోజ్ చేశారనేది అధికారకంగా ప్రకటించలేదు. సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా, జై భీం సినిమాలకు అమెజాన్ లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో కంగువ డిజిటిల్ రైట్స్ ను అధిక ధరకు కొనుగోలు చేసింది అమెజాన్ ప్రైమ్. విడుదలైన 8వారాల తర్వాత డిజిటల్ ప్రీమియర్ చేసేలా ఒప్పదం చేసుకున్నారు మేకర్స్. ఆ లెక్కన వచ్చే ఏడాది జనవరిలో కంగువ డిజిటల్ ప్రీమియర్ కు వస్తుంది. కంగువ రెండు భాగాలుగా తెరకెక్కించారు మేకర్స్. మరి రెండిటికి కలిపి ఒకేసారి డిజిటల్ రైట్స్ డీల్ చేసారా లేదా పార్ట్ 1 కు మాత్రమే చేసారా అనే క్లారిటీ లేదు. భారీ ఎత్తున రిలీజ్ అయిన కంగువ ఏ మేర కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి

Show comments