Kamal Haasan: వరుస కాల్స్ వస్తున్నాయి.. ఇలా అవుతుందని అనుకోలేదు.. వీడియో రిలీజ్ చేసిన కమల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamal Haasan Releases a Video about Kalki 2898 AD Movie: భారతీయుడు 2 సినిమాకి మిక్స్డ్ టాక్, డిజాస్టర్ కలెక్షన్స్ గురించి చర్చ జరుగుతున్న సమయంలో ఆ సినిమా హీరో కమల్ హాసన్ ఒక వీడియో రిలీజ్ చేశారు. అయితే అయన వీడియో రిలీజ్ చేసింది భారతీయుడు 2 సినిమా గురించి కాదు. ఆయన నటించిన మరో సినిమా ‘కల్కి 2898 AD’ గురించి. ‘కల్కి 2898 AD’లో యాస్కిన్ పాత్రకు అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన లభించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు 1050 కోట్ల రూపాయలను రాబట్టి ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన ఐదో భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ క్రమ్మలో కమల్ ఈరోజు ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసి కల్కి భారీ విజయంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ, వరుస ఫోన్లు వస్తున్నాయి. కెరీర్లో దాదాపు 250 సినిమాలు చేశాను. కానీ ఇది చాలా స్పెషల్. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. ‘కల్కి సినిమా పెద్ద హిట్. కలెక్షన్లు పెరుగుతున్నాయి. ఇది సంతోషకరమైన క్షణం. దాదాపు 250 సినిమాలు చేశాను కానీ అందులో కొన్ని అంతగా ఆకట్టుకోలేదు అని అన్నారు.
Anant Ambani’s Wedding: అనంత్ అంబానీ-రాధిక పెళ్లి సమయంలో బాంబు బెదిరింపు.. ఇంజనీర్ అరెస్ట్
Also Read
- Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
- The Paradise Censor Cuts: నాని 'ది ప్యారడైజ్' పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
- Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
- Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు... ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ఇక యాస్కిన్ పాత్రను ఎలా డిజైన్ చేశారనే దాని గురించి కమల్ మాట్లాడుతూ, ‘మేము కలిసి ఈ యాస్కిన్‌ని రూపొందించాము. నాగ్ అశ్విన్ రూపొందించాడు. అతను ఉలితో వచ్చాడు, నేను సుత్తితో వచ్చాను. మేము ఒక సుత్తితో ఆకారాన్ని తయారు చేసాము, తరువాత కాల్చామని అన్నారు. ఇక తన షార్ట్ స్క్రీన్ టైమ్ గురించి కమల్ మాట్లాడుతూ.. ‘నేను ఈ సినిమాలో తక్కువ వ్యవధి మాత్రమే ఉన్నానని అన్నారు. యాస్కిన్ గెటప్ చూశా, నాకు రాత్రిళ్ళు కూడా భయం కలిగేలా ఆ డిజైన్ ఉంది. ‘ఈ సినిమా చేయడానికి భారతదేశంలోని కొంతమంది పెద్ద స్టార్స్ కలిసి వచ్చారు. నాగ్ అశ్విన్‌కు ఊహించే శక్తి ఉన్న చిన్నతనం ఉంది, దీనిని ప్రోత్సహించాలి. మీరు పార్ట్ 2లో యాస్కిన్ ను మరింతగా చూస్తారని అన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ నిర్మించిన భారతదేశంలోని అత్యంత ఖరీదైన చిత్రం. ఈ చిత్రానికి డైలాగ్స్‌ని సాయి మాధవ్ బుర్రా రాశారు.’కల్కి 2898 AD’లో ప్రభాస్‌తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ మరియు పలువురు ఇతర నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
తాజావార్తలు
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
-
Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
-
Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!