Mandadi : 100 కోట్ల క్లబ్లో సుహాస్-సూరిల ‘మండాడి’.. ప్రత్యేకంగా అభినందించిన కమల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్, కోలీవుడ్ వెర్సటైల్ నటుడు సూరిల కలయికలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘మండాడి’ బాక్సాఫీస్ వద్ద ఊహించని సంచలనాలు సృష్టిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై యావత్ సౌత్ ఇండియాను షేక్ చేసిన ఈ చిత్రం, ఏకంగా రూ.100 కోట్ల క్లబ్లో సగర్వంగా అడుగుపెట్టి ట్రేడ్ వర్గాలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కంటెంట్ లో దమ్ముంటే కలెక్షన్ల సునామీ సృష్టించవచ్చని నిరూపించిన ఈ చిత్రాన్ని చూసి ఇప్పుడు ఇండియన్ సినిమా లెజెండ్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు.
బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘మండాడి’ టీమ్‌కు ఇప్పుడు సాక్షాత్తూ దిగ్గజ నటుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించగా.. తాజాగా ‘లోకనాయకుడు’ కమల్ హాసన్ సైతం ‘మండాడి’ టీమ్‌ను స్వయంగా పిలిపించుకుని మరీ సత్కరించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సక్సెస్ ఫుల్ టీమ్‌ను కమల్ ప్రత్యేకంగా కలిసి, వారితో ముచ్చటించారు. సుహాస్, సూరి, రవీంద్ర విజయ్ ల నటనను, దర్శకుడు మతిమారన్ పుగళేంది టేకింగ్ ను కమల్ హాసన్ ఎంతో గొప్పగా ప్రశంసిస్తూ తన బెస్ట్ విషెస్ తెలియజేశారు.
Also Read
- Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
- Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
- Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ 'లవ్ అండ్ వార్' ఫస్ట్ లుక్ రిలీజ్
- Hashmi - Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
కమల్ హాసన్ లాంటి లెజెండ్ నుంచి ప్రశంసలు దక్కడంతో హీరో సూరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన సోషల్ మీడియా వేదికగా ఆయన ఎమోషనల్ అవుతూ.. “ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజు. మా ‘మండాడి’ టీంపై డా. కమల్ హాసన్ సర్ కురిపించిన ప్రేమ, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు, చెప్పిన మాటలు మాకు ఎంతో ప్రత్యేకం. ఈ అవకాశం కల్పించిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు” అని పోస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Mandadi : 100 కోట్ల క్లబ్లో సుహాస్-సూరిల ‘మండాడి’.. ప్రత్యేకంగా అభినందించిన కమల్
-
Harish Rao : హరీశ్ వర్సెస్ కాంగ్రెస్.. ఇక కోర్టులోనే.!
-
SIR row: CEC జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం.!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Trump-Jinping: జిన్‌పింగ్‌కు ట్రంప్ దంపతులు స్వాగతం పలకడం వెనుక ఇంత మతలబు ఉందా?
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!