Kaliyugam Pattanamlo: మార్చి 22న ‘కలియుగం పట్టణంలో’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో వండర్లు క్రియేట్ చేస్తున్న యంగ్ మేకర్లు కొత్త, భిన్నమైన కథలు, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తూ విజయాలు అందుకుంటున్నారు. నిజానికి ప్రేక్షకులు సైతం కొత్త తరహా చిత్రాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో నాని మూవీ వర్క్స్ అలాగే రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తిక్, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘కలియుగం పట్టణంలో’ అనే ఓ డిఫరెంట్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కందుల గ్రూప్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకుంటున్నారు. రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు కలిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.
Also Read: Donald Trump: సొంత బ్రాండ్ షూస్‌ను విడుదల చేసిన డొనాల్డ్ ట్రంప్.. కేవలం 399 డాలర్లే
Also Read
ఈ మూవీలో చిత్రా శుక్లా మరో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. టాలీవుడ్‌లో ఇది వరకు ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమాలు రాలేదని సరికొత్త పాయింట్‌తో మంచి సందేశాన్ని ఇస్తూ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా ఈ చిత్రాన్ని రూపొదించామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది, కడప జిల్లాలోనే షూటింగ్‌ను ఫినిష్ చేశారు. 45 రోజుల కాల వ్యవధిలో సినిమా షూటింగ్ ఎటువంటి ఆటంకాలు లేకుండా, విజయవంతంగా పూర్తి చేశామని, అందుకు సహకరించిన యూనిట్‌కు థాంక్స్ చెప్పారు నిర్మాత. దీంతో ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మార్చి 22న ఈ మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న మేకర్స్ త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టనున్నారు. ఎడిటర్‌గా గ్యారీ బీహెచ్ వంటి టాప్ టెక్నీషియన్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. అజయ్ అరసాడ సంగీతాన్ని అందించగా ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్, భాస్కర భట్ల వంటి వారు పాటలకు సాహిత్యాన్ని అందించారు. చరణ్ మాధవనేని కెమెరామెన్‌గా పని చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలను చేపట్టనున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!