Site icon NTV Telugu

Kaantha Teaser: సినిమా పేరు శాంత కాదు కాంత.. ఆడియన్స్ కి ఇదే నచ్చుతుంది!

Kaantha

Kaantha

దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నపీరియడ్ చిత్రం కాంతా ఫస్ట్ లుక్ పోస్టర్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటుడు సముద్రకని కీలక పాత్రలో కనిపిస్తుండగా, భాగ్యశ్రీ బోర్సే ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన కథానాయికగా నటిస్తోంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ స్పిరిట్ మీడియా ప్రై. లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రై. లిమిటెడ్ బ్యానర్లపై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ జన్మదిన సందర్భంగా, చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది, ఇది ఈ భారీ ప్రాజెక్ట్‌పై అంచనాలను మరింత పెంచింది.

Also Read : Rakul Preet : పనికిమాలిన వాళ్లు ఎక్కువయ్యారు.. రకుల్ ఘాటు కామెంట్లు

‘మోడర్న్ స్టూడియోస్’ దర్శక శిఖామణితో రూపొందించబోతున్న చిత్రం ‘శాంత’, తెలుగులో మొదటి హారర్ ఫిల్మ్ అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభం కాగా… సముద్ర ఖని సినిమాలో సీనియర్ డైరెక్టర్ రోల్ చేస్తున్నట్టు క్లారిటీ వచ్చింది. అస్సలు పడని ఓ డైరెక్టర్, హీరో కలిసి చేస్తే ఎలా ఉంటుంది ? అనే బ్యాక్ డ్రాప్‌తో మూవీ తెరకెక్కినట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. 1950 మద్రాస్ బ్యాక్ డ్రాప్‌లో అప్పటి హీరో, డైరెక్టర్ మధ్య ఏం జరిగింది?, ఇద్దరు ప్రాణ మిత్రులు , బద్ద శత్రువులుగా ఎందుకు మారాల్సి వచ్చింది? అనేది ఆసక్తిని పెంచేసింది. దుల్కర్ సల్మాన్ హీరోగా డైరెక్టర్ సముద్రఖనిని డామినేట్ చేస్తుండగా… ‘సినిమా పేరు శాంత కాదు కాంత’ అంటూ టైటిల్‌నే మార్చేయడం మరింత హైప్ క్రియేట్ చేసింది.

Exit mobile version