NTV Telugu Site icon

Jyothika : కంగువ నెగిటివ్ రివ్యూస్ పై జ్యోతిక వార్నింగ్ పోస్ట్

Jtothuika

Jtothuika

నేను ఈ నోట్‌ని సూర్య భార్యగా కాకుండా జ్యోతికగా సినీ ప్రేమికురాలిగా మాత్రేమే రాస్తున్నాను. కంగువ అద్భుతమైన సినిమా. సూర్యని చూస్తుంటే గర్వంగా ఉంది. ఇలాంటి సాహస వంతమైన సినిమా చేయాలంటే చాలా ధైర్యముండాలి. తొలి అరగంట సినిమా బాగోలేదు అందుకు నేను అంగీకరిస్తాను, BGM కూడా చాలా లౌడ్‌గా, ఇరిటేటింగ్ గా అనిపించింది.  మన  ఇండియాన్ సినిమాలలో తప్పులు సహజమే. మరీ ముఖ్యంగా ఇంతటి భారీ సినిమాల్లో  చిన్న చిన్న పొరపాట్లు  చాలా కామన్. మరోసారి  చెబుతున్నా మూడు గంటల సినిమాలో తొలి అరగంట మాత్రమే బాగోలేదు. కానీ కొందరు మీడియా వారు , పలువురు సినీ ప్రముఖుల కంగువపై నెగిటివ్ రివ్యూస్ రాయడం చూసి  ఆశ్చర్యం కలిగింది.

Also  Read : Darshi : ప్రియదర్శి ‘సారంగపాణి జాతకం’ టీజర్ డేట్ ఇదే..

కానీ ఈ నెగిటివ రివ్యూస్ వారికి గతంలో అవే పాత చింతకాయ పచ్చడి కథలతో తీసిన సినిమాలకు, హీరోలు అమ్మాయిల వెంటపడుతూ , డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండే సినిమాలకు, అలాగే ఓవర్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటే  సినిమాస్ కు ఇంతటి నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం ఎప్పుడు చూడలేదు. ఆ విషయమా ఎలా ఉంచితే అసలు ‘కంగువ’ పాజిటివ్ అంశాల సంగతేంటి? సెకండాఫ్‌లో అమ్మాయిల ఫైట్ సీక్వెన్స్, పిల్లాడి ట్రాక్  రివ్యూ రాసేటప్పుడు ఇవేవి మీకు  పాజిటివ్ గా అనిపించలేదా..? మొదటి రోజు  ‘కంగువ’పై ఇంత భారీ స్థాయిలో నెగిటివిటీ చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపించింది. కనీసం రిలీజ్ రోజు మార్నింగ్ షో ఫినిష్ కాకుండానే కొందరు కావాలని గ్రూప్ గా ఏర్పడి ఈ ప్రాపగాండా చేసినట్టు అనిపిస్తోంది.  సినిమాని కావాలని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపించింది. వాస్తవానికి ఇంతటి భారీ కాన్సెప్ట్ ను అద్భుతంగా 3D లో తెరకెక్కించేందుకు మీ కష్టానికి కనీసం ప్రశంసలు దక్కాలని నాకు అనిపిస్తుంది. టీమ్ కంగువ గర్వంగా ఉంది.  నెగిటివ్‌ రివ్యూస్ రాసేవారికి, ఈ సినిమా గురించి నెగిటివ్ మాట్లాడేవాళ్లకు అలా చేయడం మాత్రమే తెలుసు’ అని జ్యోతిక ఇన్ స్టాలో పోస్ట్  చేసింది.