Jyothi Raj Shocking Comments on jani Master: జానీ మాస్టర్ వ్యవహారం మీద మరో డాన్స్ మాస్టర్ సందీప్ భార్య జ్యోతి తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సందీప్ మాస్టర్ ఆట షో ద్వారా గుర్తింపు తెచ్చుకుని ఈమధ్య బిగ్ బాస్ లో పాల్గొన్నారు. అయితే మధ్యలోనే హౌస్ లో నుంచి బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన భార్య జ్యోతి కూడా డాన్సరే. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే జానీ మాస్టర్ అంశం మీద జ్యోతి ఒక వీడియో రిలీజ్ చేసింది. “ఈ రోజుల్లో చాలా చాలా ఓవర్ స్మార్ట్ అయిపోతున్నారు చాలా మంది. బేసిగ్గా నేను చాలా మంది అమ్మాయిలు గురించి వీడియోలు చేస్తున్నా, అత్యాచారం జరిగిన అమ్మాయిలకు న్యాయం చేయరుగాలని వీడియోలు పెట్టడానికి. కానీ ఎవరైనా ఆడపిల్లల్ని లైంగికంగా వేధించి ఆడపిల్లలతో తప్పుగా ప్రవర్తించే వాళ్ళకి ఎవరికైనా కచ్చితంగా శిక్ష పడాల్సిందే. చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళని వదలకూడదు.
Jani Master: ఐదారేళ్లుగా లేనిది ఇప్పుడెందుకు? జానీ మాస్టర్ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్ సంచలనం
అలాగే ఈ సెక్షన్ల పేరుతో ఓవర్ స్మార్ట్ నెస్ తో బయట మగవాళ్ళ మీద ఉన్న క్రైమ్ రేట్ ఉద్దేశించి ఒక మగవాడు కష్టపడి సంపాదించుకున్న కెరియర్ ని దెబ్బ కొట్టాలి అని ఓవర్ స్మార్ట్ గా ఉన్న వాళ్ళని కూడా ఖచ్చితంగా అలాగే శిక్షించాలి. ఒక మనిషి గురించి ఒక ఆరోపణ వచ్చిన వెంటనే దాన్ని వెనుక ఎంత నిజం ఉంది ఎంత అవాస్తవం ఉంది రెండువైపులా విన్నప్పుడే మనం జడ్జిమెంట్ చేయాలి. అంతేకానీ అతను ఒక పొజిషన్లో ఉన్నాడు కదా అని వ్యూస్ కోసం మన ఇంటర్వ్యూస్ కోసం చేయకూడదు. తప్పు చేస్తే ఎవరిని వదలకూడదు, కచ్చితంగా నిజం అనేది బయటకు వస్తుంది. చట్టం దృష్టిలో అందరూ సమానమే’’ అంటూ ఆమె వీడియోలో పేర్కొన్నారు. అయితే ఈ మొత్తం వీడియోలో ఆమె ఎవరి పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం. అయితే ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమ మొత్తం జానీ మాస్టర్ హాట్ టాపిక్ అవుతున్న నేపథ్యంలో ఆమె జానీ మాస్టర్ గురించే మాట్లాడి ఉండవచ్చు అని భావిస్తున్నారు.