Site icon NTV Telugu

Jr NTR : ఫ్యామిలీ లెగసీపై ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు

Esquire India

Esquire India

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ‘ఎస్క్వైర్ ఇండియా’ అనే ఒక మ్యాగజైన్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అంతేకాక ఆ మ్యాగజైన్ కవర్ పేజీపై జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ప్రచురించడంతో ఆయన అభిమానులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఒక ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తనకు తన కుటుంబానికి సంబంధించిన సినిమాల లెగసీ విషయంలో ఏం జరుగుతుందో తెలియదని, తాను ఆ విషయంలో ఎలాంటి ప్లాన్స్ వేసుకోలేదని చెప్పుకొచ్చాడు. కానీ తాను చెప్పే కథలతో తనను గుర్తుంచుకోవాలనే ప్రయత్నం మాత్రం చేస్తున్నానని అన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా తనను ఒక నటుడిగా కంటే ఎక్కువగా ఒక నిజాయితీగల మనిషిగా గుర్తించాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. ఎమోషన్స్‌తో కూడిన నిజాయితీగల వ్యక్తిగా తనను గుర్తిస్తే చాలని ఆయన అన్నారు.

Also Read : Mass Jathara: ‘మాస్ జాతర’.. ‘ఓలే ఓలే’ భలే ఉందే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టెంపర్ నుండి వరుస హిట్స్ కొడుతూ టాలీవుడ్ లో మరే ఇతర హీరోలు సాధించలేని రికార్డులను తన పేరిట నమోదు చేస్తున్నాడు ఎన్టీఆర్. RRR సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్ ను పెంచుకున్నాడు తారక్. అటు ఓవర్సీస్ లోను ఎన్టీఆర్ సినిమాలు భారీ కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఇక ఇప్పుడు వార్ 2తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఈ నెల 14న రిలీజ్ కానుంది ఈ సినిమా.

Exit mobile version