Mass Jathara: ‘మాస్ జాతర’.. ‘ఓలే ఓలే’ భలే ఉందే!
- మాస్ మహారాజా రవితేజ 'మాస్ జాతర' చిత్రం నుంచి రెండవ గీతం 'ఓలే ఓలే' విడుదల
- భీమ్స్ సిసిరోలియో శైలిలో ఉత్సాహభరిత గీతంగా 'ఓలే ఓలే'
- తమ ఎనర్జీతో పాటను మరో స్థాయికి తీసుకెళ్ళిన రవితేజ-శ్రీలీల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ‘మాస్ జాతర’ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించి.. సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. మొదటి గీతంగా విడుదలైన ‘తు మేరా లవర్’ అందరినీ ఉర్రూతలూగించింది. ఇప్పుడు రెండవ గీతంగా ‘ఓలే ఓలే’ను విడుదల చేసింది చిత్ర బృందం. అందరూ కాలు కదిపేలా ఎంతో ఉత్సాహభరితంగా ఈ సాంగ్ ఉంది.
Also Read : Tollywood Wage Dispute: బంద్ పై కార్మిక శాఖ కీలక వ్యాఖ్యలు!
Also Read
- Fauji vs Spirit: రిలీజ్‌కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
- Anand Deverakonda: వైష్ణవి చైతన్యతో రిలేషన్.. అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ!
- Varanasi Movie: 'వారణాసి' అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
- స్టార్ హీరో లేడు.. భారీ ప్రమోషన్ లేదు.. రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూ.130 కోట్లు వసూళ్లు.. Hanuman Ansh ఫుల్ స్టోరీ ఇదే!
ధమాకా జోడి రవితేజ-శ్రీలీల తెరపై కనిపిస్తే ఆ సందడే వేరు. ‘ఓలే ఓలే’ పాటతో ఈ జోడి మరోసారి ఆకట్టుకుంది. ఇద్దరూ పోటాపోటీగా నర్తించి పాటను మరో స్థాయికి తీసుకెళ్ళారు. రవితేజ తన వింటేజ్ స్టెప్పులతో అలరించారు. శ్రీలీల తన అసాధారణ నృత్య ప్రతిభతో మరోసారి కట్టిపడేశారు. ఇద్దరూ కలిసి ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా తెరపై మెరుపులు మెరిపిస్తున్నారు. సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో తనదైన శైలిలో స్వరపరిచిన ‘ఓలే ఓలే’ మాస్ రాజా అభిమానులకు, మాస్ ప్రేక్షకులకు విందు భోజనంలా ఉంది. థియేటర్లలో ప్రేక్షకుల చేత.. ఈలలు, చప్పట్లతో స్టెప్పులు వేయించేలా ఎంతో ఉత్సాహభరితంగా ఈ గీతం సాగింది. ఇక ప్రతిభావంతులైన రోహిణి సోరట్ తన గాత్రంతో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు. భాస్కర్ యాదవ్ దాసరి అందించిన సాహిత్యం ఉల్లాసంగా, ఆకర్షణీయంగా ఉంది. పాట యొక్క మూడ్‌కి సరిగ్గా సరిపోయే మాస్ ఫ్లేవర్‌తో ఆయన సాహిత్యం నిండి ఉంది. సంగీతం, సాహిత్యం, గాత్రం అన్నీ చక్కగా కుదిరి.. ‘ఓలే ఓలే’ను అదిరిపోయే మాస్ గీతంగా మలిచాయి.’మాస్ జాతర’ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఫుల్ మీల్స్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Nagoya Flooding: ఆసియా క్రీడలకు ముప్పు? నగోయాలో తీవ్ర వరదలు.. వందలాది మంది అథ్లెట్ల తరలింపు
-
YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
-
Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Bihar Liquor Smuggling: మద్యం మాఫియా కొత్త ఎత్తుగడ.. అందమైన మధ్యతరగతి అమ్మాయిలే టార్గెట్..
ట్రెండింగ్
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్‌ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?