“డెవిల్”కు ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ ఖరారు

నవీన్ మేడారం దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ తదుపరి చిత్రం “డెవిల్” రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో అతను బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడు. ‘బాహుబలి’ తరువాత తెలుగు చిత్రనిర్మాతలు, హీరోలు పాన్-ఇండియన్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. “డెవిల్” కూడా అదే బాటలో నడుస్తున్నాడు. 1945లో బ్రిటిష్ ఇండియా, మద్రాస్ ప్రెసిడెన్సీలో జరిగిన సంఘటనలకు సంబంధించిన భారీ బడ్జెట్ డ్రామా “డెవిల్”. “డెవిల్” మేకర్స్ ప్రముఖ సాంకేతిక నిపుణులు ప్రొడక్షన్ డిజైనర్ రామకృష్ణ, ఆర్ట్ డైరెక్టర్‌ మౌనికలను కళ్యాణ్ రామ్ ప్రాజెక్ట్ లో భాగంగా తీసుకొచ్చారు.

Read Also : దాసరి నారాయణరావు కొడుకులపై కేసు

ఈ విషయాన్ని నేడు పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. రామకృష్ణ, మోనికా “రంగస్థలం, ఉప్పెన, తలైవి, అంతరిక్షం” వంటి చిత్రాలకు పని చేశారు. ప్రస్తుతం వారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న నటిస్తున్న యాక్షన్ డ్రామా “పుష్ప” కోసం పని చేస్తున్నారు. దేవాన్ష్ నామా “డెవిల్”ను సమర్పిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడలో విడుదల అవుతుంది. మరోపక్క కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ మూవీ “బింబిసార”. ఈ చిత్రంలో కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

-Advertisement-"డెవిల్"కు ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ ఖరారు

Related Articles

Latest Articles