జూనియర్ ఎన్టీయార్ కొరటాల శివ కాంబోలో వచ్చిన దేవర ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో చెప్పక్కర్లేదు. ఆంధ్ర నుండి అమెరికా దాకా దేవర కలెక్షన్స్ దండయాత్ర చేసాడు. మరి ముఖ్యంగా ఆంధ్రాలోని మారుమూల సీ సెంటర్స్ లో మూతపడే స్టేజ్ లో ఉన్న థియేటర్లకు దేవర రూపంలో హౌసేఫుల్ బోర్డ్స్ పెట్టె రేంజ్ కు దేవర వెళ్ళింది. అంతటి ఘాన విజయం సాధించిన దేవరలో యాక్టర్ అజయ్ కీలక పాత్రలో నటించాడు. సెకండ్ పార్ట్ లో అజయ్ పాత్ర సినిమా ముఖ్య భూమిక పోషించనుంది.
Also Read : Teaser Release : ‘భవానీ వార్డ్ 1997’ టీజర్ విడుదల చేసిన సత్యం రాజేష్
దేవర, మత్తువదలరా 2 సక్సెస్ తో అజయ్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రేండింగ్ అవుతున్నాడు. కాగా అజయ్ పొట్టెల్ అనే సినిమాలో పటేల్ అనే పాత్రలో విలన్ గా నటించాడు. ఈ శుక్రవారం పొట్టెల్ ట్రైలర్ లాంఛ్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో పాల్గొన్నాడు అజయ్. అయితే ఓ జర్నలిస్ట్ దేవర పార్ట్ – 1 లో మీ రోల్ ఎక్కువగా చూపించారు. పార్ట్ -2 లో మీ క్యారక్టర్ ఎలా ఉండబోతుంది అని ప్రశించగా, అజయ్ సమాధానంగా బదులిస్తూ ” ఇప్పుడు అది చెప్తే చంపేస్తారు. అసలు దేవర పార్ట్ -2 గురించి నేను ఒక్క మాట మాట్లాడిన దర్శకులు కొరటాల శివ చంపేస్తారు. అది చాలా సెన్సిటివ్ ఇష్యు, ఇప్పడు దాని గురించి వద్దు, పార్ట్ -2 లో నాది కీ రోల్’ అని అన్నారు. విలన్ గా అజయ్ కు విక్రమార్కుడు లాంటి పేరు తెస్తుందని టీజర్ చూసిన ప్రతీ ఒక్కరు అజయ్ ను అభినందిస్తున్నారు.
"Meeru Oohinchani adbutham ga untadhi"
~Actor #Ajay shares about #Devara
Second Part Thandavame💥💥💥#JrNTR 's Shiva Thandavam❤️🔥🤘🏻#Devara #JrNTR #NTR #DevaraJatara pic.twitter.com/RrliBuCHII
— Movie Threat (@MovieThreat) October 18, 2024