NTRxAnilRavipudi: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని ఒక క్రేజీ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. పవర్ఫుల్ మాస్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, నాన్‌స్టాప్ కామెడీ ఎంటర్టైనర్లకు పెట్టింది పేరైన దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. స్వయంగా ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో, ఒక్కసారిగా సినీ వర్గాల్లోనే కాకుండా అభిమానుల్లోనూ భారీ ఉత్సాహం నెలకొంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను కన్ఫర్మ్ చేస్తూ ఎన్టీఆర్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. “ఇది కచ్చితంగా ఒక నవ్వుల జాతర కాబోతోంది” అంటూ అనిల్ రావిపూడిని ట్యాగ్ చేస్తూ #NTRxAnilRavipudi హ్యాష్‌ట్యాగ్‌తో తారక్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఈ పోస్ట్‌లో తన సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్, సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్‌లను కూడా ట్యాగ్ చేశారు. దీనిని బట్టి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నట్లు స్పష్టమవుతోంది.
సాధారణంగా ఎన్టీఆర్ సినిమా అంటే హై-వోల్టేజ్ యాక్షన్, భారీ ఎమోషన్స్ ఉంటాయి. అలాంటి మాస్ హీరోకు, మొదటి నుంచి చివరి వరకు కడుపుబ్బా నవ్వించే అనిల్ రావిపూడి మార్క్ కామెడీ తోడైతే థియేటర్లలో నవ్వుల జాతర ఖాయమని సినీ ప్రియులు భావిస్తున్నారు. ముఖ్యంగా ‘అదుర్స్’ సినిమాలో చారి పాత్రతో తారక్ పండించిన కామెడీని అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేరు. మళ్లీ ఇన్నేళ్లకు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తారక్ పూర్తిస్థాయి ఎంటర్టైనర్ చేయబోతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అసలు ఎవరూ ఊహించని ఈ సర్ప్రైజ్ అనౌన్స్‌మెంట్‌తో `#NTRxAnilRavipudi` హ్యాష్‌ట్యాగ్ క్షణాల్లోనే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. “అసలు ఊహించని క్రేజీ కాంబో ఇది”, “బాక్సాఫీస్ వద్ద నవ్వుల తుఫాను సృష్టించడం ఖాయం” అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు, షూటింగ్ అప్డేట్స్ త్వరలోనే వెలువడనున్నాయి.
This one’s going to be a laugh riot… @AnilRavipudi
#NTRxAnilRavipudi
@NANDAMURIKALYAN @NTRArtsOfficial https://t.co/jUMssuUrtU
— Jr NTR (@tarak9999) November 14, 2026

