Site icon NTV Telugu

NTR- Trivikram: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా కోసం స్టార్ విలన్‌?

Jr Ntr, Trivikram

Jr Ntr, Trivikram

త్రివిక్రమ్ “గుంటూరు కారం” తర్వాత ఇప్పటివరకు మరో సినిమాను లైన్‌లో పెట్టలేదు. మధ్యలో అల్లు అర్జున్‌తో ఒక మైథాలజికల్ సినిమాను ప్లాన్ చేశాడు, కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా అల్లు అర్జున్ ఆ సినిమా చేయలేనని చెప్పాడు. ఇప్పుడు అదే సినిమాను జూనియర్ ఎన్టీఆర్‌తో చేస్తున్నాడు. ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు, కానీ సినిమా నిర్మిస్తున్న వంశీ ఇప్పటికే పలుమార్లు సినిమా గురించి హింట్స్ ఇచ్చాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కార్తికేయుడి పాత్రలో నటించబోతున్నాడు. ఈ సినిమాలో మిగతా పాత్రల కోసం త్రివిక్రమ్ కీలకమైన నటులను తీసుకునే ప్లాన్‌లో ఉన్నాడు.

Also read:100: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆర్కే సాగర్ ‘ది 100’ ట్రైలర్‌ లాంచ్

నిజానికి, త్రివిక్రమ్ సినిమా అంటే కాస్టింగ్ చాలా బలంగా ఉంటుంది. చిన్న చిన్న పాత్రలకు కూడా ప్రముఖ నటులను మాత్రమే తీసుకుంటాడు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పాత్రకు వ్యతిరేకంగా ఒక రిషి పాత్రలో నటించేందుకు దగ్గుబాటి రానాను సంప్రదించినట్లు తెలుస్తోంది. రానాకు మంచి శరీర సౌష్టవం, అలాగే కమాండింగ్ వాయిస్ ఉంది. ఆ పాత్రకు రానా అయితే సరిగ్గా సరిపోతాడని, ఎన్టీఆర్‌కు సరైన ప్రత్యర్థిగా నిలబడతాడని భావిస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి “బాహుబలి”తో రానా మంచి విలన్‌గా గుర్తింపు సంపాదించాడు. ఇప్పుడు ఈ సినిమా కోసం నిజంగానే త్రివిక్రమ్ రానాను తీసుకుంటే, సినిమా మరింత ఎలివేట్ అవ్వడం ఖాయం.

Exit mobile version