Johnny Master – Sekhar Master: టాలీవుడ్లో కలకలం.. జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Johnny Master – Sekhar Master: తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్‌లో ఎన్నికలు, సభ్యత్వ అంశాలపై ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ పరిణామంతో అసోసియేషన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఫెడరేషన్ అనుమతి లేకుండానే బైఎలక్షన్ నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశంపై వివాదం మొదలైనట్లు తెలుస్తోంది.
ఈ విషయంలో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాలు పరస్పరం అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సమావేశం ఉద్రిక్తంగా మారినట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణ విధానం, సభ్యత్వానికి సంబంధించిన పలు అంశాలపై కూడా ఇరు వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఈ వివాదానికి నిరసనగా దాదాపు 10 మంది డాన్సర్లు తమ సభ్యత్వాలకు రాజీనామా చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రాజీనామాలపై ఇప్పటివరకు అసోసియేషన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. అలాగే జానీ మాస్టర్ లేదా శేఖర్ మాస్టర్ కూడా ఈ వ్యవహారంపై బహిరంగంగా స్పందించలేదు. ప్రస్తుతం ఈ ఘటన టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్‌లో నెలకొన్న ఈ వివాదం ఎలా ముగుస్తుంది? ఎన్నికల వ్యవహారంపై అసోసియేషన్ లేదా సంబంధిత ఫెడరేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read
BREAKING NEWS 🔴
Verbal war took place between #Jani Master and #Sekhar Master pic.twitter.com/Z9buopAws6
— Movies4u Official (@Movies4u_Officl) July 12, 2026
తాజావార్తలు
-
OTR: పాయల్ శంకర్ రైతు యాత్రకు అధిష్టానం నో.. అసలు కారణం ఏంటి…?
-
OTR: తాండూరులో ఇద్దరు పవర్ సెంటర్లు.. అన్నదమ్ముల ఆధిపత్య పోరుతో అధికారులకు తిప్పలు..
-
OTR : ఎమ్మిగనూరులో వైసీపీ తడబాటు.. నేతల అహంకారమే కారణమా..?
-
Story Board : ఢిల్లీ కాలుష్యాన్ని ఎంతకాలం భరించాలి ?జనం అనారోగ్యం పాలైనా పట్టించుకోరా ?
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు
ట్రెండింగ్
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?