Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Jinn Movie Director Chinmay Ram Interview December 19 Release

Jinn : షూటింగ్ సెట్‌లో వింత అనుభవాలు.. భారీ కారు ప్రమాదం!

Published Date :December 18, 2025 , 11:17 pm
By Bhargav Chaganti
  • jinn movie, jinn Telugu movie, Chinmay Ram interview, jinn movie release date, jinn horror fantasy film, Ammit Rao jinn movie, Parvez Simba jinn movie, Telugu horror movies 2025, jinn movie teaser trailer, jinn 2 movie, Telugu cinema news
Jinn : షూటింగ్ సెట్‌లో వింత అనుభవాలు.. భారీ కారు ప్రమాదం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

డిసెంబర్ 19న థియేటర్లలోకి రాబోతున్న విభిన్న కథా చిత్రం ‘జిన్’. సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో చిన్మయ్ రామ్ దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే టీజర్, ట్రైలర్లతో అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు చిన్మయ్ రామ్ తన మనోగతాని మీడియాతో పంచుకున్నారు.

కల నుంచి పుట్టిన కథ: ‘జిన్’
దర్శకుడు చిన్మయ్ రామ్ మాట్లాడుతూ, ఈ సినిమా పుట్టుక వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. “నేను కన్నడ చిత్ర పరిశ్రమలో 17 ఏళ్లుగా ఉన్నాను. అక్కడ రెండు సినిమాలు కూడా చేశాను. అయితే నా మిత్రుడు పర్వేజ్ సింబాకు ఒకరోజు వచ్చిన ఒక వింత కలలో నుంచి ఈ ‘జిన్’ కాన్సెప్ట్ పుట్టింది. ఆ పాయింట్ వినగానే నాకు చాలా కొత్తగా అనిపించి ఈ కథను సిద్ధం చేశాను” అని ఆయన తెలిపారు. తెలుగులో తన తొలి ప్రయత్నం ఇంత భారీగా జరుగుతుండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సినిమా ఇంత క్వాలిటీగా రావడానికి నిర్మాత నిఖిల్ ఎం. గౌడ ఇచ్చిన సహకారమే కారణమని దర్శకుడు కొనియాడారు. “నిఖిల్ లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా అవసరం. ఎక్కడా రాజీ పడకుండా సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టారు” అని పేర్కొన్నారు. ఇక సాంకేతిక నిపుణుల గురించి చెబుతూ.. సంగీత దర్శకుడు అలెక్స్ ఈ చిత్రానికి ‘మొదటి హీరో’ అని, సునీల్ విజువల్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

షూటింగ్ సెట్‌లో వింత అనుభవాలు
కేవలం తెర మీద మాత్రమే కాదు, షూటింగ్ సమయంలో కూడా చిత్ర యూనిట్‌కు కొన్ని భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయట. సెట్‌లో లైట్లు దానంతట అవే ఆరిపోవడం. కెమెరాలు అకస్మాత్తుగా పని చేయడం ఆగిపోవడం. ప్రమోషన్స్ కోసం వెళ్లినప్పుడు జరిగిన భారీ కారు ప్రమాదం. వీటన్నింటినీ తలచుకుంటూ, “ఆ ప్రమాదం నుంచి మేం ప్రాణాలతో బయటపడటమే ఒక అదృష్టం. ఇదంతా ‘జిన్’ ప్రభావమే అని మా యూనిట్ నమ్మింది” అని చిన్మయ్ రామ్ వివరించారు. “జిన్ అంటే ఏంటి? దాని వెనుక ఉన్న రహస్యాలు ఏంటి? అన్నది ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని పాయింట్. థియేటర్‌కు వచ్చే సగటు ప్రేక్షకుడు తాను పెట్టే ప్రతి రూపాయికి సరిపడా వినోదాన్ని పొందుతాడని నేను హామీ ఇస్తున్నాను” అని దర్శకుడు భరోసా ఇచ్చారు. అంతేకాకుండా, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తే ఇప్పటికే సిద్ధంగా ఉన్న ‘జిన్ 2’ స్క్రిప్ట్‌ను వెంటనే పట్టాలెక్కిస్తానని ఆయన వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ammit Rao jinn movie
  • Chinmay Ram interview
  • jinn 2 movie
  • jinn horror fantasy film
  • Jinn Movie

తాజావార్తలు

  • IPL 2026 Captains: కొత్త కెప్టెన్స్ పూర్తి లిస్ట్ ఇదే? ధోని, విరాట్, రోహిత్‌ను తప్పించడంపై ఫుల్ క్లారిటీ!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • Trump-Iran: ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా ప్లాన్ మిస్‌ఫైర్! కారణమిదేనా?

  • Harish Shankar : పొరపాటు జరిగింది.. క్షమించండి ‘మహేశ్ బాబు’ వివాదంపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!

  • Annadata Sukhibhava: ఏపీ ప్రజలకు శుభవార్త.. ఉగాది కానుకలుగా అన్నదాత సుఖీభవ, గృహ ప్రవేశాలు!

ట్రెండింగ్‌

  • Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions