Telugu Film Federation: జానీ మాస్టర్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ ఊహించని షాక్.. మళ్లీ సస్పెన్షన్ వేటు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్ర పరిశ్రమలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ వివాదం మళ్లీ రాజుకుంది. డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో చెలరేగిన అంతర్గత విభేదాలు, జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్ వివాదం నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎత్తివేసిన జానీ మాస్టర్ సస్పెన్షన్‌ను మళ్లీ యథావిధిగా పునరుద్ధరిస్తున్నట్లు ఫెడరేషన్ అధికారికంగా ప్రకటించింది. డ్యాన్సర్స్ యూనియన్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై చర్చించేందుకు ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని నేతృత్వంలో మిగతా 23 క్రాఫ్ట్స్ ప్రతినిధులతో అత్యవసర జనరల్ కౌన్సిల్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో జానీ మాస్టర్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.
గతంలో ఫెడరేషన్తో కలిసి నడుస్తానని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి, తిరిగి ఫెడరేషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అనిల్ వల్లభనేని స్పష్టం చేశారు. అంతేకాకుండా, మెగాస్టార్ చిరంజీవి, నిర్మాతల మండలి వంటి పెద్దల మాటలను తోసిపుచ్చి డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత ఏకపక్షంగా నిర్వహించిన ఉపఎన్నికలను ఫెడరేషన్ తీవ్రంగా తప్పుబట్టింది. ఆ ఎన్నికల ద్వారా ఏర్పడిన నూతన కార్యవర్గానికి ఎటువంటి సహకారం అందించబోమని, అయితే సాధారణ డ్యాన్సర్లు ఫెడరేషన్‌ను ఆశ్రయిస్తే మాత్రం వారికి పూర్తి మద్దతు ఇస్తామని స్పష్టం చేసింది. తాజా సస్పెన్షన్ నిర్ణయంతో జానీ మాస్టర్ భవిష్యత్ కార్యాచరణ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read
- Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
- Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
- Avengers Endgame Encore: బాహుబలి రికార్డు బద్దలు.. ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టించిన హాలీవుడ్ మూవీ..!
- Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
-
Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
-
TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
-
Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
-
DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?