అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ బాలీవుడ్ లో కథానాయకిగా నిలదొక్కుకుంది. తొలి సినిమా ధడక్ తోనే మంచి పేరు తెచ్చుకున్న జాన్వీ ఆ తర్వాత వెబ్ సీరీస్, సినిమాలతో నటిగా తనేమిటో నిరూపించుకుంది. ప్రస్తుతం దోస్తోనా2, గుడ్ లక్ జెర్రీ సినిమాల తో బీజీగా ఉన్న జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇప్పటికీ హాట్ టాపిక్ నే. గతంలో పలువురు హీరోల సినిమాల్లో నటిస్తుందనే వార్తలు వినవచ్చినా అవేవి కార్యరూపం దాల్చలేదు. అయితే ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఐనను పోయి రావెల హస్తినకు లో జాన్వీనే కథానాయిక అని గట్టిగా వినవచ్చింది. కానీ ఆ సినిమా ఏకంగా క్యాన్సిల్ అయింది. ఇప్పుడు త్రివిక్రమ్ మహేశ్ తో సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో శ్రీదేవి తనయ హీరోయిన్ గా నటించనుందనే ప్రచారం జరుగుతోంది. నిజానికి జాన్వీ తండ్రి బోనీ కపూర్ దక్షిణాదిలో తన కూతురు లాంఛింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు మహేశ్ సినిమా ఓకె అయితే అది జాన్వీకి సరైన ఎంట్రీగా భావించవచ్చు. శ్రీదేవి అభిమానులు ఆమె కూతురు ఎంట్రీ కోసం ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారు. జాన్వీ సోషల్ మీడియా ద్వారా ఎప్పటి కప్పుడు తన ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటూనే వస్తోంది. మరి మహేశ్ తో జాన్వీ ఎంట్రీ ఉంటుందా? లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ…