జాన్వీ కపూర్ తాజాగా తన సినిమా ‘హోమ్‌బౌండ్’ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇషాన్ ఖట్టర్‌తో కలిసి నటించిన ఈ చిత్రం విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో పలు ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడినప్పుడు లభించిన స్పందన సినిమా బృందానికి గర్వకారణమైంది. ఇందులో భాగంగా..
Also Read : Karuppu : సూర్య ‘కరుప్పు’ కు సంక్రాంతి కష్టాలు..
జాన్వీ మాట్లాడుతూ.. “ఇది చాలా అద్భుతమైన కథ. నా కెరీర్‌కి ఎంత వరకు ఉపయోగపడుతుందో అనుకోవడం కాకుండా, కథ నన్ను ఎంతగానో ఆకట్టుకోవడంతో వెంటనే అంగీకరించాను. ప్రతి సన్నివేశం పైన శ్రద్ధ పెట్టాం. కేన్స్‌లో ఈ చిత్రానికి లభించిన ఆదరణ చూసినప్పుడు మేమంతా ఆశ్చర్యపోయాం. నిజానికి ఈ సినిమా చేసినందుకు నన్ను ట్రోల్ చేస్తారేమో అనే భయం కూడా రాలేదు. ఇక ఇషాన్ ఖట్టర్ గురించి మాట్లాడాలి.. అతడు భారతీయ సినిమాలో అత్యంత ప్రతిభావంతులలో ఒకడు. కానీ ఇప్పటి వరకు అతనికి తగిన గుర్తింపు రాలేదు. కేన్స్ వేదికపై ప్రపంచం అతని నటనను ప్రశంసించడం చూసి నాకు ఎంతో సంతోషం కలిగింది. కష్టపడే వారికి ఎప్పటికైనా గుర్తింపు వస్తుందని ఇక్కడ మరోసారి నిరూపితమైంది” అని జాన్వీ ప్రశంసలు కురిపించారు.
‘హోమ్‌బౌండ్’ అనేది ఇద్దరు స్నేహితుల మధ్య అనుబంధాన్ని చూపించే హృద్యమైన కథ. దర్శకుడు నీరజ్ ఘైవాన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్‌తో పాటు విశాల్ జెత్వా కీలక పాత్రలు పోషించారు. కేన్స్‌లోనే కాకుండా, ఇటీవల ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IFFM)లో కూడా ఈ సినిమా మెప్పించింది. ఉత్తమ చిత్రంగా, అలాగే నీరజ్ ఘైవాన్‌కు ఉత్తమ దర్శకుడి అవార్డులు రావడం ఈ చిత్రానికి గౌరవాన్ని మరింత పెంచింది. మొత్తంగా, జాన్వీ వ్యాఖ్యల వల్ల ఇషాన్ ప్రతిభపై మళ్లీ చర్చ మొదలైంది. అలాగే ‘హోమ్‌బౌండ్’ ఒక కంటెంట్ డ్రైవెన్ సినిమా గా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.