జాన్వీ కపూర్… శ్రీదేవి కూతురు, బోనీ కపూర్ తనయ, అర్జున్ కపూర్ చెల్లెలు! మరి ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న జాను పెళ్లి ఎలా చేసుకుంటుంది? ఖచ్చితంగా బిగ్ ఫ్యాట్ బాలీవుడ్ వెడ్డింగే జరుగుతుంది. కాదుకూడదంటే సముద్రాలు దాటి వెళ్లి ఏ విదేశంలోనో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటంది! ఇంతే అనుకుంటున్నారా? అయితే, జాన్వీ లెటెస్ట్ ఇంటర్వ్యూలోని హైలైట్స్ వింటే మీరు తప్పకుండా షాకవుతారు! టిపికల్ బీ-టౌన్ బ్యూటీస్ చెప్పే ఏ సమాధానం కూడా అతిలోక సుందరి కూతురు, యువలోక సుందరి… జాన్వీ చెప్పలేదు!
పికాక్ మ్యాగజైన్ కోసం తన పెళ్లి ముచ్చట్లు చెప్పిన జాన్వీ కపూర్, ‘బ్యాచిలరేట్ పార్టీ’ గుట్టు విప్పింది. పెళ్లికి ముందు మిస్ జాను జరుపుకునే చివరి పార్టీని అందమైన దీవిలో పడవపైన ఎంజాయ్ చేస్తుందట! ఇక పెళ్లి ఎక్కడో తెలుసా? మన తిరుపతిలోనట! పూర్తి సంప్రదాయ బద్ధంగా పూలు, మామిడి తోరణాలతో అలంకరించిన పందిరలో ఏడు అడుగులు వేస్తుందట యువ సుందరి! సంగీత్, మెహందీ లాంటి ఈవెంట్స్ అన్నీ ‘మా స్వంతింట్లోనే’ అనేసింది మిస్ కపూర్! ఇంకా షాకింగ్ ఏంటంటే… “అసలు రిసెప్షన్ అవసరమా?” అంటోంది ‘దఢక్’ బ్యూటీ! పెళ్లికి పిలిచిన వారితోనే సరిపెట్టేస్తుందట జాను. భారీ రీసెప్షన్ హంగామా ఏముండదట!
Read Also : ఎట్టకేలకు స్పందించిన శిల్పాశెట్టి… భర్త కేసుపై సుదీర్ఘ వివరణ
వివాహ వేడుకలు రెండు రోజుల్లో ఖతమ్ చేసేస్తాను అని కూడా చెబుతోంది ‘రూహీ’ బ్యూటీ. ఎక్కువ రోజులు సంబరాలు పెద్ద ఇష్టం ఉండదట. అంతే కాదు, పెళ్లి కూతురిగా ప్రపంచం ముందుకొచ్చినప్పుడు ఏవేవో డిజైనర్ కాస్ట్యూమ్స్ కాకుండా కాంచీవరం చీరతో లక్ష్మీదేవిలా కళకళలాడిపోతానని మురిపెంగా చెప్పింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్… పెళ్లిలో జాన్వీ స్టైలిస్ట్ ఎవరో తెలుసా? తన చెల్లెలు ఖుషీనేనట!
జాన్వీ చెప్పిన పెళ్లి ముచ్చట్లు ఆశ్చర్యం కలిగించాయి కదా? అందుకే, ఇప్పుడు ఆమె ‘పికాక్ మ్యాగజైన్ బ్రైడల్ ఇంటర్వ్యూ’ సొషల్ మీడియాలో వైరల్ అవుతోంది! ఇంతకీ, జాన్వీ మెడలో మూళ్లు వేసే ఆ అందగాడు ఎవరో అంటూ చర్చ కూడా సాగుతోంది…