Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్‌లో స్కిన్ షో చేస్తే బూతులు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సౌత్ ఇండస్ట్రీలో చేసిన సినిమాల విషయంలో సోషల్ మీడియాలో కాంట్రవర్సీగా మారింది. ఇటీవల వచ్చిన పెద్ది సినిమా ఈ వివాదానికి అసలుకారణమైంది.దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన పెద్దిలో జాన్వీ కపూర్ పాత్ర గ్లామర్ షో విమ్మర్శలకు దారితీసింది. ఈ విషయంలో సౌత్ కన్నా నార్త్ క్రిటిక్స్ ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. జాన్వీని సౌత్ మేకర్స్ గ్లామర్ డాల్‌గా మాత్రమే వాడుకుంటున్నారని ఆరోపిస్తూ బుచ్చిబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
నార్త్ మీడియా అక్కడి క్రిటిక్స్ అయితే ఏకంగా ‘సెక్స్ ఎక్స్ప్లోటేషన్’ (లైంగిక దోపిడీ), ‘డిస్గస్టింగ్’ అంటూ దర్శకుడిపై పెద్ద పెద్ద పదాలు వాడుతూ విరుచుకుపడుతున్నారు. జాన్విని పెద్ది సినిమాలో కేవలం స్కిన్ షో కోసమే తీసుకున్నారని ఇది చాలా దారుణమని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విమర్శలపై సౌత్ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బాలీవుడ్ తీరును ఎండగడుతూ గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. బాలీవుడ్లో హీరోయిన్స్‌తో అంగాంగ ప్రదర్శన చేయిస్తున్న మేకర్స్ గురించి మీరెందుకు మాట్లాడరు అంటూ నార్త్ క్రిటిక్స్‌ను సౌత్ ఆడియన్స్ ప్రశ్నిస్తున్నారు. విడుదలకు రెడీగా ఉన్న కాక్టైల్ సినిమాలో రష్మిక, కృతిసనన్ ను ఎలా చుపించారో తెలుసంటూ నెటిజన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. దీపికా, త్రిప్తి డుమ్రి, కియారా వంటి హీరోయిన్స్‌తో పదే పదే బలవంతంగా టూ పీస్ బికినీలు వేయించడం, ఘాటైన లిప్ లాక్ సీన్స్ చేయించడం మీకు తప్పుగా అనిపించలేదా అని నిలదీస్తున్నారు. బాలీవుడ్లో అందాల ఆరబోత చేస్తే అది ఫ్యాషన్ అని అదే సౌత్‌లో చేస్తే బూతుగా కనిపిస్తుందా అని మండిపడుతున్నారు. ఎడాపెడా స్కిన్ షోలు చేయించే బాలీవుడ్ వాళ్ళు సౌత్ మేకర్స్‌కు నీతులు చెబుతున్నారా అంటూ నార్త్ నెటిజన్లతో ఆడుకుంటున్నారు.
Also Read
- Dragon : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసెంబర్ దాకా ఆగాల్సిందే!
- buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
- chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్‌తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్‌పై మెగాస్టార్ రియాక్షన్‌ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
- Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్‌లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
తాజావార్తలు
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్‌లో స్కిన్ షో చేస్తే బూతులు?
-
MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక… సాయి పల్లవి చేజారినట్టే ?
-
Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
-
Iran-Israel Tensions: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..
-
Shubman Gill History: చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. భారత క్రికెట్ చరిత్రలోనే మొదటి కెప్టెన్!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!