ప్రపంచంలో అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్‌లో ఒకటైనా మెట్ గాలా 2025 న్యూయార్క్ నగరంలో మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో ప్రారంభమైంది. ఈ ఈవెంట్ రెడ్ కార్పెట్ పై అందాల భామలు కియారా అద్వానీ, ప్రియాంక చోప్రా, సింగర్ దిల్జిత్ దోసాంజ్, తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల ముఖ్యంగా షారుఖ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. బ్లాక్ సూట్ లో భిన్నమైన జ్యువెలరీతో స్టైలీష్ లుక్ లో ఆకట్టుకున్నాడు. అయితే కొంత మంది ఫ్యాషన్ అభిమానులు వారి దుస్తులను ప్రశంసించగా.. మరికొందరు విమర్శిస్తూ నెట్టింట్లో పోస్టులు పెడుతున్నారు. దీంతో తాజాగా ఈ విషయంపై బాలీవుడ్ నాయిక జాన్వీ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది.
Also Read : Irul : ఎడ్జ్-ఆఫ్-ది-సీట్ ఎక్స్ పీరియన్స్‌కి సిద్ధంగా ఉండండి !
‘ మన చేతి వృత్తుల వారికి, డిజైనర్లకు ప్రపంచంలోని అత్యుత్తములైన ప్రతి ఒక్కరు ఈ మెట్ గాలా లాంటి ప్రపంచ వేదికలో వెలుగులోకి రావడానికి అర్హులు. వారికి ఇది చాలా మంచి సమయం. ఈ వేదిక పై మన భారతీయ ప్రతిభను చూసి బాధపడే బదులు. మనకు దక్కాల్సిన అర్హతను పొందుతున్నందుకు సంతోష పడండి. మా దుస్తులు అత్యంత అద్భుతమైనవని. బాలేకీయ కళాకారుల గుర్తింపు గురించి మాట్లాడుకుంటే.. దశాబ్దాలుగా మన చేతివృత్తుల వారి పనిని మన దేశం నుంచి ఎగుమతి చేసి ప్రపంచ వేదికలపై ప్రదర్శిస్తున్నాడు. కానీ వారికి ఎలాంటి క్రెడిట్ లేకుండా పోయింది. ఇప్పుడు మన కళాకారులకు వారి పనిని ప్రదర్శించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. మెట్ వేదిక పై మనవాళ్లను చూడడం గౌరవంగా భావిస్తున్నా’ అని చెప్పింది.
