‘పెద్ది’ రిలీజ్ తర్వాత జాన్వి క్యారెక్టర్ పై వచ్చిన విమర్శలతో, ఒక్కసారిగా అందరికీ శ్రీదేవి గుర్తుకొచ్చింది. శ్రీదేవి కనుక బతికుంటే జాన్వికి ఇలాంటి పరిస్థితి వచ్చేదా.. అంటూ జగదేక సుందరి ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. తండ్రి బోనీ కపూర్, జాన్వి కెరీర్ గురించి పట్టించుకోలేదా? ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ బోల్డ్‌గా కనిపిస్తూ పరువు తీసుకుందా? శ్రీదేవి అందం, అభినయం కూతుళ్లు జాన్వి, ఖుషికి రాకపోయినా, అదృష్టం కలిసి వచ్చి హీరోయిన్స్ అయ్యారు. శ్రీదేవి బతికున్నప్పుడే జాన్వి ‘ధడక్’తో వెండితెరకు పరిచయమైంది. కూతురు డెబ్యూ మూవీ కథ, క్యారెక్టర్ అన్నీ తానే చూసుకుంది. కానీ, ‘ధడక్’ రిలీజ్ కాకుండానే శ్రీదేవి చనిపోయింది. గ్లామర్‌కు చోటు లేకుండా డెబ్యూ మూవీనే అయినా, పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది జాన్వి. ‘ధడక్’ తర్వాత పర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న ‘గుంజన్ సక్సేనా’, ‘గుడ్ లక్ జెర్రీ’, ‘మిలీ’ వంటి సినిమాలు చేసినా సక్సెస్ కాలేదు. కెరీర్ మొదట్లో హద్దుల్లో ఉన్నా, ఫోటో షూట్స్, ఈవెంట్స్‌లో స్కిన్ షోకు తెరలేపింది జాన్వి.
ఇదే ఫ్లోలో గ్లామర్ రోల్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, దర్శకులు అడ్వాంటేజ్‌గా తీసుకొని ఈ అమ్మడిని అగ్లీగా, వల్గర్‌గా చూపించడం మొదలుపెట్టారు. జాన్వి ‘దేవర’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. నాలుగు గ్లామర్ సీన్స్, పాటల్లో స్కిన్ షోకే పరిమితమైపోయింది. అయితే, సినిమా పాన్ ఇండియా హిట్ కావడంతో, మరో తెలుగు సినిమా ‘పెద్ది’కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జాన్వి. కెరీర్‌లో ఎన్ని గ్లామర్ రోల్స్ చేసినా, ఎప్పుడూ లేని విధంగా ‘పెద్ది’ పుణ్యమా అని అందరితో తిట్లు తినాల్సి వచ్చింది. హీరోయిన్స్‌ని కూరలో కరివేపాకులా తీసేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. చాలా మంది ముద్దుగుమ్మలు స్కిన్ షోకే పరిమితమయ్యారు, మరి వాళ్లందరూ ఎందుకు ట్రోల్ అవ్వలేదు? విమర్శల బారిన ఎందుకు పడలేదు? ‘పెద్ది’లో జాన్వి పోషించిన ‘అచ్చియమ్మ’ రోల్‌నే ఎందుకు తప్పు పడుతున్నారు?
చాలా సినిమాల్లో చాలా మంది హీరోయిన్స్ స్కిన్ షోతో ఎంత రెచ్చిపోయినా, క్రిటిక్స్ే కాదు ఆడియన్స్ కూడా పట్టించుకోలేదు. కానీ, ‘అచ్చియమ్మ’ పాత్ర దగ్గరికి వచ్చేసరికి జాన్విని డీగ్రేడ్ చేసి చూపించాడు దర్శకుడు. పల్లెటూరి అమ్మాయిని ఎంత అందంగా చూపిస్తే, అంత అందంగా ఫ్రేమ్ ఉంటుంది. కానీ, బట్టలే భారం అన్నట్లు చూపించడం ఆడియన్స్‌కు నచ్చలేదు. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తన కెమెరాను అందాల చుట్టూ వల్గర్‌గా తిప్పాడు. దర్శకుడు తన మేకింగ్‌తో ‘అచ్చియమ్మ’ను అగ్లీ హీరోయిన్‌గా చేసేసాడు. “హీరోయిన్‌ని మరి ఇంత దిగజార్చి చూపించాలా” అని విమర్శలు వెల్లువెత్తడంతో, దిగివచ్చిన బుచ్చిబాబు సారీ చెప్పాడు.
బుచ్చిబాబు క్షమాపణలు చెప్పి అగ్లీ సీన్స్ తొలగించినా, అప్పటికే జాన్వికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఎపిసోడ్‌తో ఒక్కసారిగా శ్రీదేవి ఫ్యాన్స్‌కు జగదేక సుందరి గుర్తుకొచ్చింది. ఆమె అందం, అభినయం కూతుళ్లకు రాకపోయినా, అదృష్టం కలిసి వచ్చి హీరోయిన్స్ అయ్యారు. కానీ, వచ్చిన ఇమేజ్‌ను కాపాడుకోకుండా చేజేతులా డ్యామేజ్ చేసుకున్నారని.. శ్రీదేవి బతికుంటే ఇలాంటి పాత్రలు చేయనిచ్చేదా అంటూ వాపోయారు. శ్రీదేవితో కూతుర్లను పోల్చలేం. అందం, అభినయంతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌ని కొన్నేళ్ల పాటు ఏలిన ఆమె, గ్లామర్ విషయంలో బార్డర్ ఎప్పుడూ క్రాస్ చేయలేదు. అందంగా కనిపించడానికి కేవలం స్కిన్ షోను నమ్ముకోలేదు. కానీ, కూతుళ్లు జాన్వి, ఖుషి మాత్రం రివర్స్‌లో వెళ్తూ ఆన్ స్క్రీన్ మీదే కాదు, ఆఫ్ స్క్రీన్‌లోనూ రెచ్చిపోతున్నారు. మరి ‘పెద్ది’ దెబ్బకైనా అక్కాచెల్లెళ్లు మారి, లైన్‌లో పడతారో లేదో చూడాలి మరి.

