Jangaa: రా అండ్ రస్టిక్ లుక్‌తో షాక్ ఇచ్చిన హీరో!

Jangaa Movie

Jangaa Movie

టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న యంగ్ హీరో త్రిగుణ్ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జంగా’ ప్రేక్షకులకు సరికొత్త గిఫ్ట్ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటివరకు సాఫ్ట్ రోల్స్, లవర్ బాయ్ క్యారెక్టర్లలో కనిపించిన త్రిగుణ్ ఈ మోషన్ పోస్టర్‌లో మునుపెన్నడూ చూడని ఊరమాస్ అవతారంలో కనిపించి అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు.

విడుదలైన ‘జంగా’ మోషన్ పోస్టర్‌ను గమనిస్తే.. ఇందులోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ మరియు సౌండింగ్ చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. త్రిగుణ్ తన కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్ ఒక ‘రా అండ్ రస్టిక్’ లుక్‌లో, ఊరమాస్ గెటప్‌లో కనిపిస్తూ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేశారు. ఆయన కెరీర్‌లోనే ఇది అత్యంత వైవిధ్యమైన, వైల్డ్ సబ్జెక్ట్ అని మోషన్ పోస్టర్ కట్ చూస్తేనే అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతూ చివరి దశకు చేరుకుంది. ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై శ్రీమతి వనిత కిలారి సమర్పణలో రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కెవిన్ గడ్డం (శ్రీహరి) కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో త్రిగుణ్ సరసన నేహా పఠాన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పవర్‌ఫుల్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిన వరలక్ష్మీ శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో మెరవనున్నారు. వీరితో పాటు శ్రావణ్, మధునందన్, గగన్ విహారి, చందు గౌడ, సమీర్, నాగ మహేష్, భూపాల్ రాజు, రఘు కారుమంచి, రచ్చ రవి లాంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తున్నారు.

×
×
Ad