రజనీ, కమల్ తర్వాత కోలీవుడ్ ప్రేక్షకులకు అత్యంత ఆరాధించే నటుడు విజయ్. నాట్ ఓన్లీ కోలీవుడ్, ఓవర్సీస్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. అత్యధిక ఫ్యాన్స్ సంఘాలున్న నటుడు కూడా అతడే. అలాంటి హీరో సినిమాలు కాదని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చే ఏడాది తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న దళపతి చివరి సినిమాగా జననాయకుడు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ఇప్పటికే కోట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు కోలీవుడ్ సర్కిల్స్ లో గట్టిగానే టాక్ వినిపిస్తోంది.
Also Read : Akhanda2 : సంక్రాంతి రేస్ లోకి అఖండ 2.. రాజాసాబ్ వాయిదా పడుతుందా?
బాలయ్య- అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమాలోని ఓ ప్లాట్ తీసుకుని.. దానికి పొలిటికల్ టచ్ ఇచ్చి జననాయగన్ తెరకెక్కిస్తున్నాడు హెచ్ వినోద్. కెవిఎన్ ప్రొడక్షన్ అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తోంది. సుమారు రూ. 300 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఇక జనవరి 9న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. ఓటీటీ రైట్స్ రూ. 110 నుండి రూ. 120 కోట్ల వరకు ప్రముఖ డిజిటల్ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే తమిళనాడు, కేరళ థియేట్రికల్ రైట్స్ రూ. 115 కోట్లు సోల్డ్ అయినట్లు తెలుస్తోంది. అలాగే మొత్తం ఓవర్సీస్ రూ. 78 కోట్లు, ఆడియో రూ. 35 కోట్లకు అమ్ముడయినట్లు సమాచారం. అంటే ఇప్పటి వరకు నియర్లీ రూ. 350 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. ఈ లెక్కన చూసుకుంటే సినిమా బడ్జెట్ మొత్తం హక్కుల రూపంలోనే రాబట్టేసాడు జననాయకుడు విజయ్.