James Cameron: వార్నర్ బ్రదర్స్ డీల్‌పై..జేమ్స్ కామెరూన్ సంచలన లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాలీవుడ్ విజువల్ వండర్ జేమ్స్ కామెరూన్ అంటేనే థియేటర్ ఎక్స్‌పీరియెన్స్‌కు కేరాఫ్ అడ్రస్. అలాంటి దర్శకుడు ఇప్పుడు థియేటర్ల భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ సంస్థ వార్నర్ బ్రదర్స్ స్టూడియోను దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుండటం సినిమా రంగానికి ఒక ‘విపత్తు’ అని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు అమెరికన్ సెనేటర్ మైక్ లీకి ఆయన ఒక ఘాటైన లేఖ రాస్తూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
Also Read : Ayesha Khan : అది నేను కాదు నమ్మకండి.. ఫేక్ అకౌంట్లపై ఆయేషా ఖాన్ ఫైర్..!
Also Read
- Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
- Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
- BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్'
- Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
జేమ్స్ కామెరూన్ తన లేఖలో థియేట్రికల్ బిజినెస్‌కు రాబోయే ప్రమాదాన్ని హెచ్చరించారు.. ‘నా సినిమాలు తర్వాత ఓటీటీ లేదా ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో రావచ్చు.. కానీ ఒక దర్శకుడిగా నా మొదటి ఆప్షన్ ఎప్పుడూ థియేటర్ ఎక్స్పీరియెన్సే’ అని ఆయన స్పష్టం చేశారు. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ కేవలం సబ్స్క్రిప్షన్ల మీద మాత్రమే ఆధారపడతాయని, దీనివల్ల సినిమాలు నేరుగా ఓటీటీకి వెళ్లే ధోరణి పెరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వార్నర్ బ్రదర్స్ వంటి పెద్ద స్టూడియోలు తమ రూట్ మార్చుకుంటే, మిగిలిన స్టూడియోల మీద కూడా ఒత్తిడి పెరిగి భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణం తగ్గిపోయే ప్రమాదం ఉందని కామెరూన్ హెచ్చరించారు. థియేటర్ రిలీజ్ విండోలు తగ్గిపోవడం వల్ల వేలాది మంది థియేటర్ కార్మికులు ఉపాధి కోల్పోతారని ఆయన తన లేఖలో ప్రస్తావించారు. నెట్‌ఫ్లిక్స్ వంటి దిగ్గజాలు కేవలం బిజినెస్ కోణంలోనే ఆలోచిస్తే సినిమా అనే కళాఖండం తన ఉనికిని కోల్పోతుందని ఆయన గట్టిగా వినిపించారు.
అయితే నెట్‌ఫ్లిక్స్ కో-సీఈఓ టెడ్ సరాండోస్ ఈ వ్యాఖ్యలను ఖండించారు. జేమ్స్ కామెరూన్ తప్పుగా అర్థం చేసుకున్నారని, తాము వార్నర్ బ్రదర్స్ సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేయడానికి కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, కామెరూన్ మాత్రం థియేటర్ ఎక్స్‌పీరియెన్స్‌ను కాపాడుకోవడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధమని సంకేతాలు ఇచ్చారు.
తాజావార్తలు
-
Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
-
Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
-
Ambati Rambabu: నన్ను కేసులతో బెదిరించాలనుకుంటే బెదిరేవారు ఎవరూ లేరు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?