NBK 112 : ముద్దుల మావయ్యకి ధన్యవాదాలు : నారా లోకేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో NBK112వ చిత్రం పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేదికగా ఈ సినిమా గ్రాండ్ లాంచ్ వేడుక అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ‘సినిమా ఓపెనింగ్ కు నేను ఎప్పుడూ రాలేదు. ముద్దుల మావయ్యకి ధన్యవాదాలు. పెద్ద బ్యానర్ పెద్ద నటుడి తో సినిమా అమరావతి లో జరగడం ఆనందంగా ఉంది. భవిష్యత్తు లో సినిమాలు ఇక్కడ ప్రారంభం కావాలి. అమరావతి లో సినీ పరిశ్రమ అభివృద్ధి కి చర్యలు తీసుకుంటున్నాము.
Also Read
సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ : బాలకృష్ణ 112 వ. సినిమా రాజధాని అమరావతి లో ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. ఆంధ్రుల అభిమాన రాజధాని అమరావతి. మెజార్టీ సినిమా అమరావతి ప్రాంతంలో నే షూటింగ్ ఉంటుంది. ఏపీ లో. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్. ఎంతో ప్రయత్నం చేస్తున్నారు.ఫిల్మ్ డవలప్మెంట్ కార్పోరేషన్ కొత్త కార్యవర్గం కూడా వచ్చింది. ఏపీ లో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి కి కృషి చేస్తున్నాం.
నందమూరి బాలకృష్ణ : మా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రులు లోకేష్, దుర్గేష్ కు నా ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ పుట్టిన నేల ఇది. ఈ నేలలో మనం సినిమా రంగాన్ని అభివృద్ధి చేద్దాం. అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఎవరినీ బలవంతం చేయడం కాదు.. ఇక్కడ అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తాం. ఏపీ లో పెద్ద సినిమా క్లాప్ కొట్టి 20 ఏళ్ళు అయింది. ఏపీ లో సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు. సినీ పరిశ్రమకు విజయవాడ ఎంతో కీలకం. అలాగే టూరిజం, సినిమాకు దగ్గర సంబంధం ఉంది. ఏపీలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి సినిమా షూటింగ్స్ చెయ్యాలి. దర్శకుడు గోపిచంద్ సినిమా త్వరలో కాకినాడ లో ప్రారంభం అవుతుంది.
తాజావార్తలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?