Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!

Jailer 2

Jailer 2

Jailer 2 Ticket Price Hike: సూపర్‌స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద మరోసారి సందడి చేసేందుకు రెడీ అయ్యారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ స్థాయిలో రిలీజ్ చేస్తోంది. సినిమా విడుదలను దృష్టిలో ఉంచుకుని టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించాలంటూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పెట్టుకున్న అర్జీని పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టికెట్ రేట్ల పెంపునకు అధికారికంగా ఆమోదం తెలిపింది. ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. అక్టోబర్ 15 నుంచి 21 వరకు (మొదటి వారం రోజుల పాటు) ఈ పెరిగిన టికెట్ ధరలు అమల్లో ఉంటాయి.

సింగిల్ స్క్రీన్లలో నార్మల్ టికెట్ ధరపై జీఎస్టీతో కలిపి అదనంగా రూ. 50 వరకు పెంచుకోవచ్చు. ఇక మల్టీప్లెక్స్‌లలో సాధారణ టికెట్ ధరపై జీఎస్టీతో కలిపి అదనంగా రూ.75 వరకు పెంపునకు ప్రభుత్వం అఫీషియల్‌గా అనుమతించింది. దీనితో పాటు తొలి ఏడు రోజులు రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు కూడా ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. ‘జైలర్’ ఫస్ట్ పార్ట్ తెలుగు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అందుకే ఈ సీక్వెల్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రంగంలోకి దిగడంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల కౌంట్ భారీగా పెరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఏపీలో టికెట్ రేట్ల పెంపుతో పాటు ఐదో షోకు కూడా పర్మిషన్ రావడంతో తొలి వారం రోజుల్లో ‘జైలర్ 2’ ఓపెనింగ్స్ అదిరిపోయే రేంజ్‌లో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అభిప్రాయడుతున్నారు.