Jailer 2: రజినీ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. తెలుగులోనే రూ.100 కోట్లు!

Jailer 2

Jailer 2

Jailer 2: బాక్సాఫీస్ దగ్గర ‘తలైవా’ సునామీ సృష్టిస్తున్నారు. వయసుతో పనేలేదని, వెండితెరపై తన మేనియా ఎప్పటికీ తగ్గదని నిరూపిస్తూ సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన విశ్వరూపం చూపించారు. ఆయన నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘జైలర్ 2’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ముఖ్యంగా తెలుగు వెర్షన్‌లో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి సరికొత్త సంచలనానికి తెరతీసింది. ఒక తమిళ హీరో సినిమా డబ్బింగ్ వెర్షన్ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ స్థాయిలో విధ్వంసం సృష్టించడం ట్రేడ్ పండితులనే ఆశ్చర్యపరుస్తోంది. చాలామంది డబ్బింగ్ హీరోల సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి.. కానీ రజనీకాంత్ వస్తే ఆ వైబ్రేషనే వేరు. తెలుగు ఆడియన్స్ ఆయన్ను ఎంతగా సొంతం చేసుకున్నారో ‘జైలర్ 2’ వసూళ్లు మరోసారి కళ్లకు కట్టాయి. మొదటి రోజే వచ్చిన పాజిటివ్ టాక్‌తో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో దద్దరిల్లిపోయాయి.

ఈ వంద కోట్ల మార్క్‌తో రజనీకాంత్ సౌత్ ఇండియాలోనే అరుదైన మైలురాయిని చేరుకున్నారు. కేవలం తెలుగు వెర్షన్ ద్వారానే నాలుగు సార్లు రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి అడుగుపెట్టిన ఏకైక తమిళ హీరోగా రికార్డులకెక్కారు. ఇతర భాషా స్టార్లకు తెలుగులో ఒకట్రెండు సినిమాలు ఆడటం చూశాం.. కానీ నాలుగు సార్లు సెంచరీ కొట్టడం ఒక్క రజనీకాంత్‌కే చెల్లిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. స్క్రీన్‌పై రజినీ స్వాగ్, నెల్సన్ స్టైలిష్ మాస్ టేకింగ్, థియేటర్లలో ఈలలు వేయించే యాక్షన్ సీన్స్ తెలుగు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి. బాక్సాఫీస్ దగ్గర రజినీ ర్యాంపేజ్ ఇంకా కొనసాగుతుండటంతో ఫుల్ రన్‌లో ‘జైలర్ 2’ మరిన్ని పాత రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.