బండోడి ట్యూన్‌కి బక్కోడి పాట.. Itlu Arjuna First Single ప్రోమో అదిరింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Itlu Arjuna First Single: టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ సోషల్ మీడియా వేదికగా ఒక క్రేజీ అప్డేట్ వదిలారు. ఆయన సంగీతం అందిస్తున్న తాజా చిత్రం ‘ఇట్లు అర్జున’ (Itllu Arjuna) నుంచి ఫస్ట్ సింగిల్ “హై రే” ప్రోమో వీడియోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రోమో రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈ వీడియోలో తమన్ – అనిరుధ్ మాటల సందర్భంలో వచ్చిన “బండోడు బక్కోడు” అనే డైలాగ్స్‌పై, మీమర్స్ రకరకాల ఫన్నీ మీమ్స్, కామెంట్స్‌తో రచ్చ లేపుతున్నారు.
తమన్ షేర్ చేసిన ఈ లీడ్ ప్రోమో వీడియో విజువల్స్ పరంగా చాలా కొత్తగా ఉంది. ఇందులో స్టైలిష్ యానిమేషన్‌తో పాటు లైవ్ యాక్షన్ షాట్స్‌ను అద్భుతంగా చూపించారు. ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ మెలడీగా వస్తున్న ఈ పూర్తి పాటను మే 28న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పాట ప్రోమోతోనే సినీ సంగీత ప్రపంచంలో సరికొత్త సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే ఈ పాట కోసం టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు తమన్ – అనిరుధ్ రవిచందర్ కలిసి పని చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఈ ఇద్దరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తాజాగా రిలీజ్ అయిన ఈ పాట ప్రోమోలో తమన్ మ్యూజిక్కు అనిరుధ్ పాట పాడటంతో ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు.
Also Read
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
- Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
- Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
- Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కలిసి మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసిన హై రే కంప్లీట్ సాంగ్ కోసం ఇప్పుడు సంగీత ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాణంలో, మహేష్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. ఈ సినిమాతో అనీష్ హీరోగా టాలీవుడ్‌కు పరిచయమవుతుండగా.. క్రేజీ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మెలొడీకి కల్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించారు. తాజాగా రిలీజ్ అయిన ఈ సాంగ్ ప్రోమో యూత్‌కు పర్ఫెక్ట్గా కనెక్ట్ అయ్యే వైబ్‌తో ఉండటంతో సాంగ్ రిలీజ్ కోసం సంగీత ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
#Haire 💬#ItluArjunaFirstSingle Promo
From A⭐️T is here 🔈♥️ pic.twitter.com/TSKwe2do8p— thaman S (@MusicThaman) May 26, 2026
తాజావార్తలు
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!