Site icon NTV Telugu

Item Songs : ఐటంసాంగ్స్‌ను కబ్జా చేస్తున్న స్టార్‌ హీరోయిన్స్‌

Heroines

Heroines

ఐటంసాంగ్ ఎవరైనా చేసేయొచ్చు. కానీ, ఆ ఛాన్స్ ఈమధ్య స్టార్స్‌ను మాత్రమే వరిస్తోంది. క్రేజీ భామలే చేయాలంటే, కోట్లలో రెమ్యునరేషన్ చెల్లించాలి. అదే ఫ్లాప్ హీరోయిన్ అయితే, లక్షల్లో ఇచ్చి, బడ్జెట్ సేవ్ చేయొచ్చు. ఈ స్ట్రాటజీతో ఐటంగర్ల్స్‌గా మారిన ఫ్లాప్ హీరోయిన్స్ ఐటమ్‌సాంగ్స్‌ను కబ్జా చేస్తున్నారు. హరిహర వీరమల్లులో నిధి హీరోయిన్ అంటూనే, ఐటంసాంగ్ చేస్తోందని చెప్పడంతో కన్‌ఫ్యూజ్ అయ్యారు ఆడియన్స్. సినిమా చూస్తే కానీ అర్థం కాలేదు, నిధి అగర్వాల్‌ది నెగెటివ్ రోల్ కావడంతో ఐటెంసాంగ్‌ పెట్టాడు దర్శకుడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత హిట్ లేని నిధి, వీరమల్లులో హీరోయిన్ కమ్ ఐటంగర్ల్‌గా కనిపించింది.

Also Read : Alia Bhatt: వీడియోలు వైరల్.. అలియా భట్ ఆగ్రహం

రొమాంటిక్ మూవీతో వెండితెరకు పరిచయమైన ఢిల్లీ అమ్మాయి కేతిక శర్మ బ్రేక్ ఈవెన్ కోసం చాలాకాలం వెయిట్ చేసినా ఐరన్‌లెగ్ ముద్ర పోలేదు. నాలుగైదు సినిమాలు చేసినా అన్నీ ఫ్లాపులే. ఐరన్‌లెగ్ ముద్రతో ఆఫర్స్ కూడా దక్కలేదు. దీంతో రాబిన్‌హుడ్‌లో ఐటంగర్ల్‌గా యూ టర్న్ తీసుకుంది కేతిక. ఐటంగర్ల్‌గా మారిన తర్వాత ఎట్టకేలకు, ‘సింగిల్’ మూవీతో హీరోయిన్‌గా తొలి సక్సెస్ అందుకుంది. మ్యాడ్ స్క్వేర్‌లో స్వాతిరెడ్డి ఐటంసాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలవడంతో, ఐటంగర్ల్ రెబా మోనికా జాన్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ అమ్మడు సామజవరగమన అనే హిట్ మూవీతో తెలుగులోకి అడుగుపెట్టినా, హీరోయిన్‌గా మరో ఛాన్స్ రాలేదు. మరోవైపు రజనీకాంత్ కూలీలో, విజయ్ ‘జన నాయగన్’ వంటి క్రేజీ మూవీస్ చేసినా, చిన్న సినిమాలో వచ్చిన ఐటంసాంగ్‌ను వదిలిపెట్టలేదు.

ఐటంసాంగ్ ఏ ఒక్కరి సొంతం కాదు, అందరిదీ. ఫ్లాప్‌లో వున్న అప్‌కమింగ్ బ్యూటీస్‌కు, క్రేజీ లేని భామలకు, చివరికి స్టార్ హీరోయిన్స్‌కు కూడా ఓ వరమైంది. ముద్దుగుమ్మలు దీన్నొక ఐటంసాంగ్‌గా కాకుండా, స్పెషల్ సాంగ్‌గా భావిస్తూ, గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. పూజా హెగ్డే ఫ్లాప్ లిస్ట్ చూస్తే, చాలా పెద్దదే. ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టింది. ఆమధ్య వచ్చిన ‘రెట్రో’ కూడా ఫ్లాప్ అయింది. ఫ్లాప్ హీరోయిన్స్‌కు ఐటంసాంగ్ వరం అయితే, పూజా హెగ్డేకు అదృష్టమైంది. రజనీకాంత్ క్రేజీ మూవీ ‘కూలీ’లో ఐటంగర్ల్ అవతారం ఎత్తింది పూజా.

శ్రీలీల కెరీర్‌లో పెళ్లిసందడి, ధమాకా వంటి రెండు హిట్స్ తప్ప ముచ్చటగా చెప్పుకోవడానికి మూడో హిట్ లేదు. శ్రీలీల పనైపోయిందనుకున్న టైంలో పుష్ప 2లో కిసిక్ పుణ్యమా అని మళ్లీ గాడిలో పడడమే కాదు, వరుస ఆఫర్స్ కొట్టేసి రెమ్యునరేషన్ పెంచేసింది. ఫ్లాప్ హీరోయిన్స్‌ను ఐటంసాంగ్స్ ఆదుకుంటున్నాయి. కిసిక్ ఆశీస్సులతో శ్రీలీల బిజీ అయిపోయింది. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరితో జత కడుతోంది. జూనియర్ మూవీలో హీరోయిన్ అన్న పేరేగానీ ‘వైరల్ ఒయ్యారి’లో ఐటంగర్ల్‌గా మారిపోయింది శ్రీలీల. ఈ ఒక్క పాట కోసం మూడు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందని శాండిల్‌వుడ్‌లో ప్రచారం జరిగింది. తెలుగులో హిట్‌లేని మరో హీరోయిన్ తమన్నా, ప్రస్తుతం ఒక్క మూవీ కూడా చేయడం లేదు. అయితే, రాజాసాబ్‌లో ఐటంగర్ల్‌గా తమన్నా పేరే వినిపిస్తోంది. జైలర్‌లో కావాలయ్యా సాంగ్ హిట్ తర్వాత తమన్నా ఐటంగర్ల్‌గా బిజీ అయింది. పుష్ప 2లో ‘ఊ అంటావా మావా’ తర్వాత మరో ఐటంసాంగ్ చేయననన్న సమంత మనసు మార్చుకుందనిపిస్తోంది. మళ్లీ స్పెషల్ సాంగ్ చేస్తోందని ప్రచారం జరుగుతోంది. రామ్‌చరణ్ పెద్దిలో ఐటంగర్ల్‌గా సమంత పేరే వినిపిస్తోంది. ఓ బేబీ తర్వాత వరుస ఫ్లాపులతో తెలుగు ఆఫర్స్ పోగొట్టుకున్న సమంత కలిసొచ్చిన ఐటంసాంగ్ మళ్లీ చేస్తుందేమో చూడాలి మరి.

Exit mobile version