ఈ సెప్టెంబర్ 12న రెండు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అనే రీతిలో పోటీపడుతున్నారు. అందులో ఒకటి తేజ సజ్జా – మంచు మనోజ్ లీడ్ రోల్ లో నటిస్తున్న మిరాయ్. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసుకుని మరికొద్ది రోజుల్లో థియేటర్స్ లోకి వస్తోంది. అశోకుడు.. 9 పుస్తకాలు.. నేపధ్యంలో మైథలాజికల్ టచ్ తో రాబోతుంది మిరాయ్.
ఇక రెండవ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న కిష్కిందపురి. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా థ్రిల్లర్ జానర్ లో రాబోతుంది. అనుపమ పరమేశ్వరన్ దెయ్యంలా కనిపించబోతున్న ఈ సినిమాకు కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు. ఈ శుక్రవారం థియేటర్స్ లో రిలీజ్ కానుంది. రెండు సినిమాలు పోటాపోటీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే రెండు సినిమాలు ప్రీమియర్స్ వేయాలని కొద్దీ రోజుల క్రితం భావించారు మేకర్స్. కంటెంట్ పై నమ్మకంతో పెయిడ్ ప్రీమియర్స్ ను సెలెక్టెవ్ గా వేయాలని భావించారు. కానీ ఇప్పడూ ఈ విషయంపై రెండు సినిమాలు మేకర్స్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ప్రీమియర్స్ వేస్తె ఒకవేళ టాక్ తేడా వస్తే ఆ ప్రభావం రిలీజ్ రోజు పడుతుంది రిస్క్ ఎందుకు అని ప్రీమియర్స్ ను వేసే ఆలోచనపై వెనక్కి తగ్గినట్టు చర్చించుకుంటున్నారు. అయితే ఈరెండు సినిమాలలో ఓ సినిమా ఇంకా చివరి నిమిషం వర్క్ జరుగుతోందని టాక్ వినిపిస్తోంది. ప్రీమియార్స్ పై ఇంకా డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయట. మరి నువ్వా నేనా అని పోటీలో ఎవరు గెలుస్తారో