రాజమౌళితో సినిమా చేస్తే, ఏ హీరో అయిన సరే.. ఆ ఒక్క సినిమా మాత్రమే చేయాలి. ఇది రాజమౌళి కండీషన్ కూడా. ప్రస్తుతం రాజమౌళి రూలింగ్‌లో ఉన్న హీరో మహేష్ బాబు. కాబట్టి, బాబు కొత్త ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన చర్చ ఇప్పుడు అనవసరం. కానీ ఇతర హీరోలు మాత్రం ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వరుస ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతున్నారు. ప్రభాస్ చేతిలో ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 సినిమాలున్నాయి. అలాగే, హోంబలే ఫిల్మ్స్‌తో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కొన్నాళ్లు పుష్ప దగ్గరే ఆగిపోయిన బన్నీ.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు.
Also Read : NBK 111 : ఎటువంటి మార్పు లేదు.. అవన్నీ పుకార్లే..
అట్లీ, లోకేష్ కనగరాజ్, సందీప్ రెడ్డితో సినిమాలు ప్రకటించాడు. ఎన్టీఆర్ వచ్చేసి.. ప్రశాంత్ నీల్‌తో సినిమా సెట్స్ పై ఉండగానే.. దేవర 2 రెడీ చేసుకుంటున్నాడు. అలాగే.. నెల్సన్ దిలీప్ కుమార్, త్రివిక్రమ్‌తో సినిమాలు చేయబోతున్నాడు. కానీ, రామ్ చరణ్ మాత్రమే ఒకే ఒక్క ప్రాజెక్ట్ కమిట్ అయి ఉన్నాడు. నిజానికి ఆర్ఆర్ఆర్ తర్వాత గేమ్ ఛేంజర్ సినిమాతో టైం వేస్ట్ చేసుకున్నాడు చెర్రీ. కానీ, ఆ సినిమా ఫ్లాప్ అయింది. అందుకే.. పెద్దితో మెగా దాహం తీర్చడానికి సిద్ధమవుతున్నాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది ప్రస్తుతం షూటింగ్ స్టేజీలో ఉంది. ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్‌తో ఆర్సీ 17 ఒక్కటే అనౌన్స్ చేశాడు చరణ్. ఇప్పటి వరకు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో ఎలాంటి అప్డేట్ లేదు. ఈ లెక్కన మిగతా స్టార్స్ అంతా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతుంటే.. చరణ్ మాత్రమే రేసులో కాస్త వెనకబడినట్టుగా చెప్పొచ్చు. అయితే పెద్ది, ఆర్సీ 17లతో మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్‌ను రూల్ చేయడం గ్యారెంటీ!
