Site icon NTV Telugu

Thalaivar173 : సుందర్.సి డైరెక్టన్ లో రజినీ సినిమా.. రిస్క్ చేస్తున్నాడా?

Rajni 173

Rajni 173

కోలీవుడ్ టాప్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతుంది అంటూ ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. తలైవా, తాను కలిసి పనిచేస్తున్నట్లు ఉళయనాయగన్ ఎనౌన్స్ చేశాడు. ఇటు రజనీ కూడా కన్ఫర్మ్ చేయడంతో 46 ఏళ్ల తర్వాత లెజెండరీ యాక్టర్లు కలిసి వర్క్ చేయబోతున్నారంటూ తమిళ తంబీలు ఆనంద ఢోలికల్లో తేలిపోతున్నారు . వీరిని లోకేశ్ కనగరాజ్ డీల్ చేస్తున్నాడని.. కాదు కాదు.. నెల్సన్ దిలీప్ కుమార్ అంటూ వార్తలొచ్చాయి. కానీ చివరకు సడెన్లీ ఎంట్రీ తీసుకున్నాడు సి సుందర్.

Also Read : Peddi : మెగా పవర్ స్టార్ ‘ పెద్ది’ చికిరి వీడియో సాంగ్ రిలీజ్

సి సుందర్ ఆరణ్మనై చిత్రాలతో హిట్ అందుకుని ఏదో దర్శకుడిగా కాలం వెళ్లదీస్తున్న హీరో కమ్ డైరెక్టర్. హారర్ చిత్రాల స్టోరీలన్నీ ఓకేలా ఉన్నా ఫ్లూక్ లో ఆడేస్తాయంతే. అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రితం విశాల్ తో తీసిన మదగజరాజా ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేసి హిట్ కొట్టేశాడు. ఈ పొంగల్ కు మరో సినిమా లేక ఈ సినిమాను ఆదరించారు తమిళ ఆడియన్స్. ఇలాంటి దర్శకుడికి మల్టీస్టారర్ డీల్ చేస్తాడా అంటే.. కాదు తలైవా 173ని డీల్ చేయబోతున్నాడట. ఈ సినిమాను కమల్ హాసన్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించబోతుంది. అలా ఈ ప్రాజెక్ట్ మల్టీస్టారర్ మూవీగా ప్రచారం జరిగిపోయింది.. జరుగుతోంది.  రజనీకాంత్ సి సుందర్‌తో వర్క్ చేయడం ఇదే తొలిసారి కాదు. ఈ ఇద్దరి కాంబోలో 28 ఏళ్ల క్రితం అరుణాచలం అనే ఫిల్మ్ వచ్చింది. 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు చేస్తే 3వేల కోట్లకు ఆస్తిపరుడవుతాడనే విభిన్నమైన కాన్సెప్టుతో 1997లో వచ్చిన ఈ సినిమా మంచి హిట్. ఆ తర్వాత ఈ కాంబినేషన్ ఎందుకో సెట్ కాలేదు. అయితే స్టార్ డైరెక్టర్లుగా చెప్పుకుని తనకు ప్లాపులు ఇస్తున్న లోకేశ్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజ్, పా రంజిత్ తో వర్క్ చేసిన అనుభవం తర్వాత… సి సుందర్ బెటర్ అని ఫీలవుతున్నట్లున్నారు రజనీ. అందుకే రిస్కైనా పర్లేదని పాన్ ఇండియా ఐడెంటిటీ లేని దర్శకుడితో కొలబరేట్ అయ్యారు సూపర్ స్టార్. 2027 సంక్రాంతిని టార్గెట్ చేస్తోంది తలైవర్ 173.

Exit mobile version