Thalaivar173 : సుందర్.సి డైరెక్టన్ లో రజినీ సినిమా.. రిస్క్ చేస్తున్నాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ టాప్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతుంది అంటూ ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. తలైవా, తాను కలిసి పనిచేస్తున్నట్లు ఉళయనాయగన్ ఎనౌన్స్ చేశాడు. ఇటు రజనీ కూడా కన్ఫర్మ్ చేయడంతో 46 ఏళ్ల తర్వాత లెజెండరీ యాక్టర్లు కలిసి వర్క్ చేయబోతున్నారంటూ తమిళ తంబీలు ఆనంద ఢోలికల్లో తేలిపోతున్నారు . వీరిని లోకేశ్ కనగరాజ్ డీల్ చేస్తున్నాడని.. కాదు కాదు.. నెల్సన్ దిలీప్ కుమార్ అంటూ వార్తలొచ్చాయి. కానీ చివరకు సడెన్లీ ఎంట్రీ తీసుకున్నాడు సి సుందర్.
Also Read : Peddi : మెగా పవర్ స్టార్ ‘ పెద్ది’ చికిరి వీడియో సాంగ్ రిలీజ్
Also Read
- NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
సి సుందర్ ఆరణ్మనై చిత్రాలతో హిట్ అందుకుని ఏదో దర్శకుడిగా కాలం వెళ్లదీస్తున్న హీరో కమ్ డైరెక్టర్. హారర్ చిత్రాల స్టోరీలన్నీ ఓకేలా ఉన్నా ఫ్లూక్ లో ఆడేస్తాయంతే. అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రితం విశాల్ తో తీసిన మదగజరాజా ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేసి హిట్ కొట్టేశాడు. ఈ పొంగల్ కు మరో సినిమా లేక ఈ సినిమాను ఆదరించారు తమిళ ఆడియన్స్. ఇలాంటి దర్శకుడికి మల్టీస్టారర్ డీల్ చేస్తాడా అంటే.. కాదు తలైవా 173ని డీల్ చేయబోతున్నాడట. ఈ సినిమాను కమల్ హాసన్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించబోతుంది. అలా ఈ ప్రాజెక్ట్ మల్టీస్టారర్ మూవీగా ప్రచారం జరిగిపోయింది.. జరుగుతోంది. రజనీకాంత్ సి సుందర్‌తో వర్క్ చేయడం ఇదే తొలిసారి కాదు. ఈ ఇద్దరి కాంబోలో 28 ఏళ్ల క్రితం అరుణాచలం అనే ఫిల్మ్ వచ్చింది. 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు చేస్తే 3వేల కోట్లకు ఆస్తిపరుడవుతాడనే విభిన్నమైన కాన్సెప్టుతో 1997లో వచ్చిన ఈ సినిమా మంచి హిట్. ఆ తర్వాత ఈ కాంబినేషన్ ఎందుకో సెట్ కాలేదు. అయితే స్టార్ డైరెక్టర్లుగా చెప్పుకుని తనకు ప్లాపులు ఇస్తున్న లోకేశ్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజ్, పా రంజిత్ తో వర్క్ చేసిన అనుభవం తర్వాత… సి సుందర్ బెటర్ అని ఫీలవుతున్నట్లున్నారు రజనీ. అందుకే రిస్కైనా పర్లేదని పాన్ ఇండియా ఐడెంటిటీ లేని దర్శకుడితో కొలబరేట్ అయ్యారు సూపర్ స్టార్. 2027 సంక్రాంతిని టార్గెట్ చేస్తోంది తలైవర్ 173.
తాజావార్తలు
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
-
Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!