Peddi : రామ్ చరణ్ ‘పెద్ది’ వాయిదాకు ఏఆర్ రెహమాన్ కారణమా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా స్టార్ కంపోజర్ ఏఆర్ రెహమాన్‌తో వర్క్ చేయించుకోవాలంటే తల ప్రాణం తోకకు వచ్చినట్లే మేకర్స్‌కు. ఆయన నుండి ట్యూన్స్ తెప్పించుకోవాలంటే భారీ వెయిటింగ్ తప్పదు. ఆన్ టైంలో మ్యూజిక్ ఇవ్వడని ఇండస్ట్రీలో కొన్నేళ్ల నుండి టాక్. లేటైనా ఆడియన్స్ దిల్ దోచే క్యాచీ ట్యూన్స్, బీజీఎం ఇస్తుండటంతో రెహమాన్‌ను వదులుకోవట్లేదు మేకర్స్. ఇప్పుడు పెద్ది డిలే విషయంలోనూ ఫింగర్స్ రెహమాన్ వైపే చూపిస్తున్నాయి.
Also Read : swayambhu : నిఖిల్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘స్వయంభు’ ఫస్ట్ సాంగ్ ఆదరిందిగా
Also Read
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
పెద్దికి ఏఆర్ రెహమాన్ కరెక్ట్ ఛాయిస్ అని బుచ్చిబాబు భావించి.. ఏరి కోరి తెచ్చుకున్నాడు. కానీ అతడికే మైకై కూర్చున్నాడట. ఈ ఏడాది మార్చి 27న రావాల్సిన సినిమా.. షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో ఏప్రిల్ 30కి వాయిదా పడింది. తాజాగా మొత్తం టాకీ పూర్తైన మూవీ ఆన్ టైంలో రావట్లేదు. మెరుగైన అవుట్ పుట్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని టీం చెబుతున్నప్పటికీ.. ఏ ఆర్ రెహమాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం మరింత టైం కోరడంతోనే పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చిందట. పెద్దిలో టాకీ పూర్తయ్యిందని ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు చరణ్. ఇక మిగిలింది ఒక స్పెషల్ సాంగ్ మాత్రమే. అదీ కంప్లీట్ చేసి అనుకున్న డేట్‌కు తీసుకురావాలని మెగా పవర్ స్టార్ ప్లాన్. అయితే ఈ సినిమా తొలి పార్ట్‌కు బీజీఎం ఫినీష్ చేసేసిన ఏఆర్ రెహమాన్, సెకండ్ పార్ట్‌కు డిలే చేస్తున్నాడట. ఎడిట్ పూర్తయ్యాకే సెకండ్ పార్ట్‌కు కంపోజింగ్ ఇస్తానని డైరెక్టర్ బుచ్చిబాబుతో చెప్పడంతో కాదనలేకపోయాడని టీఎఫ్ఐలో వినిపిస్తోన్న బజ్. దీని వల్లే పెద్ది వాయిదా పడిందని స్ట్రాంగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే మే చివరి నాటికి టోటల్ వర్క్ కంప్లీట్ చేసి.. జూన్ నెలలో పెద్దిని తీసుకురాబోతున్నారు మేకర్స్.
Also Read : Tollywood : తిమ్మరాజు పల్లి, పాపం ప్రతాప్, బ్యాడ్ బాయ్ కార్తిక్.. ప్రీమియర్ రివ్యూ
పెద్ది కన్నా ముందు సూర్య కరుప్పు మూవీకి కమిటయ్యాడు ఏఆర్ రెహమాన్. ఆర్జే బాలాజీతో వర్క్ చేస్తానని చెప్పి మరీ జాయిన్ అయ్యాడు. కానీ చివరకు పర్సనల్ స్ట్రగుల్స్ వల్ల ఈ సినిమాకు న్యాయం చేయలేనని కరుప్పు నుండి తప్పుకున్నాడట స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. ప్రాజెక్ట్ త్వరగా కంప్లీట్ చేయాలన్న కమిట్మెంట్స్ నేపథ్యంలో రెహమాన్ ప్లేసులోకి సాయి అభ్యంకర్‌ను తెచ్చినట్లు రీసెంట్లీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు దర్శకుడు ఆర్జే బాలాజీ.
తాజావార్తలు
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?