Irumudi Movie Controversy : ‘ఇరుముడి’ సినిమాపై వివాదం.. ఆ సీన్లు తొలగించాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ఇరుముడి’. గత శుక్రవారం విడుదలైనఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో ఓ వైపు థియేటర్స్ లో వసూళ్లు దంచి కొడుతోంది. అయితే మరోవైపు ఈ చిత్రం అనుకోని వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో ప్రభుత్వ పాఠశాలలను, ఉపాధ్యాయుల వ్యవస్థను తీవ్రంగా కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (APTF) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సమాజానికి మార్గదర్శకులుగా ఉండే ఉపాధ్యాయులను తక్కువ చేసి చూపించడం సరైన పద్ధతి కాదని సినిమాలో ఉన్న ఆ వివాదాస్పద దృశ్యాలను వెంటనే తొలగించాలని ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ సినిమాలో టీచర్ పాత్రను నేగెటివ్గా చిత్రీకరించారు. ముఖ్యంగా ఉపాధ్యాయురాలి పాత్ర కనిపించే సన్నివేశాల్లో రాష్ట్రంలోని ఒక ప్రభుత్వ పాఠశాల స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా అందులో నటించిన విద్యార్థులు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో అమలులో ఉన్న యూనిఫాంలనే ధరించడం అభ్యంతరంగా ఉంది. ఇది ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా ఉందనడంలో ఎలాంటి సందేహం లేధు. సమాజంలో పాఠశాలలకు, ఉపాధ్యాయులకు ఉన్న గౌరవాన్ని దెబ్బతీసే విధంగా దృశ్యాలను తెరకెక్కించడం సరైన పద్దతి కాదు. తక్షణమే స్పందించి ఆయా సన్నివేశాలను తొలగించకపోతే ఆందోళన కార్యక్రమాలను చేపడతాం. ఈ వ్యవహారంపై సెన్సార్ బోర్డుతో పాటు సంబంధిత అధికారులు కూడా దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని’ డిమాండ్ చేశారు. మరి ఈ వివాదంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Irumudi Movie Controversy : ‘ఇరుముడి’ సినిమాపై వివాదం.. ఆ సీన్లు తొలగించాలని డిమాండ్
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!