IRUMUDI Collections : ఇరుముడి మూడు రోజుల కలెక్షన్స్.. ‘బ్లాక్‌బస్టర్’ ఈజ్ స్మాల్ వర్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ మరియు టి-సిరీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ పీరియాడిక్ అండ్ ఎమోషనల్ డ్రామా ప్రస్తుతం థియేటర్లలో సరికొత్త వసూళ్ల రికార్డులను సృష్టిస్తోంది. గత శుక్రవారం రిలీజ్ అయిన ఇరుముడి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. మొదటి మూడు రోజులు ఎక్కడ చుసిన హౌస్ ఫుల్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా చిత్ర యూనిట్ విడుదల చేసిన అధికారిక పోస్టర్ ప్రకారం ‘ఇరుముడి’ తొలి రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 80 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది.
ఎటువంటి టికెట్ ధరల పెంపు లేకుండా సాధారణ రోజుల్లో విడుదలైన ఒక ప్రాంతీయ సినిమా అతి తక్కువ సమయంలో ఈ స్థాయిలో రాణించడం అరుదైన రికార్డ్ గా మేకర్స్ ప్రకటించారు. రవితేజ మార్క్ పర్ఫామెన్స్ కు తోడు జీవి ప్రకాష్ సూపర్బ్ మ్యూజిక్ తో థియేటర్స్ లో ఆడియెన్స్ తో విజిల్స్ కొట్టిస్తుంది ఇరుముడి. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేస్తోంది. శివ నిర్వాణ భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కుటుంబ ప్రేక్షకులు, మాస్ ఆడియన్స్ థియేటర్లకు భారీగా తరలివస్తుండటంతో ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద నిజమైన ‘బాక్సాఫీస్ ర్యాంపేజ్’ కొనసాగిస్తోంది. చాలా కాలంగా హిట్ లేక సతమతమవుతున్న రవితేజకు ఇరుముడి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి వంద కోట్ల మార్క్ ను అందుకోబోతుంది.
Also Read
- Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు... ఓటీటీ డీల్ 100 కోట్లు?..
- Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. 'ఈటీవీ విన్'లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
- Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
- Vishwambhara vs Kaaka: 'విశ్వంభర' vs 'కాకా'… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
తాజావార్తలు
-
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
-
CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
-
Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్‌లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!