Mythri Movie Makers: మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో మంచి జోష్‌లో దూసుకెళ్తుంది. రిలీజ్ అయిన ఫస్ట్ డేనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనతో భారీ వసూళ్ల దిశగా వేగంగా అడుగులు వేస్తోందని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘ఇరుముడి’కు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే పూర్తి నమ్మకంతో ముందుకు వెళ్లినట్లు సమాచారం. కథ, కాన్సెప్ట్‌పై నమ్మకం ఉన్నప్పటికీ.. ఓటీటీ రైట్స్ విషయంలో సినిమా స్టార్టింగ్‌లో మాత్రం అనుకున్న స్థాయిలో ఆసక్తి కనిపించలేదనే ప్రచారం జరిగింది.
ముఖ్యంగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తొలుత ‘ఇరుముడి’ డిజిటల్ రైట్స్‌పై పెద్దగా ఆసక్తి చూపలేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపించింది. అయినప్పటికీ మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా.. కథ, రవితేజ పాత్ర, శివ నిర్వాణ టేకింగ్‌పై ఉన్న నమ్మకంతో ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సినిమా ప్రమోషన్స్ మొదలైన తర్వాత పరిస్థితులు మారినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ముఖ్యంగా ‘ఇరుముడి’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన తర్వాత సినిమాపై ఒక్కసారిగా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగడంతో పాటు, ఈ చిత్రంలో రవితేజను ఇంతకుముందెన్నడూ చూడని విధంగా కొత్త తరహా పాత్రలో చూపిస్తున్నారనే విషయం బయటకు రావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ క్రేజ్‌ను గమనించిన నెట్‌ఫ్లిక్స్.. ఆ తర్వాత ‘ఇరుముడి’ డిజిటల్ రైట్స్ కొనుగోలుకు ఆసక్తి చూపినట్లు ప్రచారం జరుగుతోంది. చివరకు మైత్రీ మూవీ మేకర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఓటీటీ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు ప్రస్తుతం సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం థియేటర్లలో ఈ సినిమాకు వస్తున్న స్పందనను చూస్తే.. మైత్రీ మూవీ మేకర్స్ ఈ కథపై పెట్టుకున్న నమ్మకం ఫలించినట్లే కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒకవైపు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి వసూళ్లు సాధించే దిశగా దూసుకెళ్తుండగా.. మరోవైపు డిజిటల్ రైట్స్ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్‌కు కూడా ఈ విజయం కలిసొచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఓటీటీ మార్కెట్ నుంచి తొలినాళ్లలో పెద్దగా స్పందన రాకపోయినా.. కంటెంట్‌పై నమ్మకంతో మైత్రీ మూవీ మేకర్స్ తీసుకున్న రిస్క్ ఇప్పుడు ‘ఇరుముడి’ సక్సెస్‌తో వర్కౌట్ అవుతోందనే టాక్ వినిపిస్తోంది.

