NTV Telugu Site icon

ATLEE : అట్లీ- సల్మాన్ ఖాన్ సినిమాపై ఇంట్రస్టింగ్ బజ్

Atlee

Atlee

బాలీవుడ్ ఈగర్లీ వెయిట్ చేస్తోన్న సల్మాన్ ఖాన్- అట్లీ సినిమా వాయిదా పడిందని, లేదు లేదు షెడ్డుకే వెళ్లిపోయిందంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. సల్లూభాయ్- అట్లీ మధ్య క్రియేటివ్ డిఫరెన్సస్ వచ్చిందని, అందుకే అల్లుఅర్జున్‌తో తన నెక్ట్స్ సినిమాను అట్లీ ప్లాన్ చేస్తున్నాడని బజ్ వినిపించింది. కాగా సడెన్లీ కండల వీరుడు తమిళ్ డైరెక్టర్ కొలబరేషన్ కాబోతున్నారంటూ ఓ గాసిప్ చక్కర్లు కొడుతుంది. సల్మాన్- అట్లీ కాంబోలో రాబోతున్న ప్రాజెక్టు షెడ్డుకు వెళ్లలేదనేది లేటేస్ట్ బజ్. ఈ ప్రాజెక్టు ఆలస్యం కావడానికి రీజన్ రజనీకాంత్, కమల్ అని టాక్.

Also Read : Daaku Maharaaj : డాకు మహారాజ్ ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా లేదు..

సల్మాన్ ఖాన్‌కు తండ్రి పాత్ర పోషించడానికి ఈ స్టార్ హీరోలను అప్రోచ్ అయితే కమల్ యాక్సెప్ట్ చేయలేదని, రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. ఇప్పుడు రజనీకి ఉన్న కమిట్ మెంట్స్ వల్ల కాల్ షీట్స్ ఖాళీ లేక ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతున్నట్లు బీటౌన్, కోలీవుడ్ సర్కిల్సో వార్తలొస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం సన్ పిక్చర్స్, అట్లీ గట్టిగా ప్లాన్ చేస్తున్నారట. రూ 650 కోట్ల భారీ బడ్జెట్‌తో మూవీ తెరకెక్కించనున్నట్లు సమాచారం. సల్మాన్ – రజనీ మార్కెట్ విలువ, స్టామినాను దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ ఈ రేంజ్ బడ్జెట్ తయారు చేయించాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు నార్త్, ఇటు సౌత్ మార్కెట్‌ను కొల్లగొట్టేలా ఈ ఇద్దరు హీరోలను దింపుతున్నాడట అట్లీ. అలాగే హాలీవుడ్ రేంజ్‌లో ప్లాన్ చేసేందుకు అక్కడ యాక్టర్లను కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం చేయబోతున్నాడని బజ్. ఈ రీజన్ల వల్లే సినిమా వాయిదా పడింది తప్ప  ఆగిపోలేని సమాచారం. ఇక ఈ సినిమా పట్టాలెక్కేందుకు ఇంకా టైం ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్‌తో మూవీని ప్లాన్ చేస్తున్నాడట అట్లీ.