Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Indragnti Mohana Krishna Interview For Sarangapani Jatakam

Indragnti Mohana Krishna: నమ్మకాలు మూఢనమ్మకాలుగా మారితే.. “సారంగపాణి జాతకం”: ఇంద్రగంటి

Published Date :April 19, 2025 , 5:22 pm
By Bhargav Chaganti
Indragnti Mohana Krishna: నమ్మకాలు మూఢనమ్మకాలుగా మారితే.. “సారంగపాణి జాతకం”: ఇంద్రగంటి
  • Follow Us :
  • google news
  • dailyhunt

వెర్సటైల్ స్టార్ ప్రియదర్శి టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం “సారంగపాణి జాతకం”, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించిన హాస్యప్రధాన చిత్రం. “జెంటిల్‌మన్”, “సమ్మోహనం” వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత ఇంద్రగంటి మరియు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో తెరకెక్కిన ఈ సినిమా, ఏప్రిల్ 25, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రంలో హీరోయిన్‌గా రూపా కొడవాయూర్ నటించగా, వెన్నెల కిషోర్, వైవా హర్ష, అవసరాల శ్రీనివాస్, సాయి శ్రీనివాస్ వడ్లమాని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాటోగ్రఫీ పీజీ విందా, సంగీతం వివేక్ సాగర్, ఎడిటింగ్ వెంకటేశ్ కే మార్తాండ్ నిర్వహించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు ఇంద్రగంటి మీడియాతో మాట్లాడారు.

ప్రశ్న: చాలా రోజుల తర్వాత జంధ్యాల, ఈవీవీ గారి తరహాలో పూర్తి వినోదాత్మక చిత్రం తీస్తున్నారు. ఈ ఆలోచన ఎలా వచ్చింది?
ఇంద్రగంటి: ఒకప్పుడు తెలుగులో సంవత్సరానికి ఐదారు కామెడీ చిత్రాలు వచ్చేవి. ఇప్పుడు యాక్షన్ సినిమాల హవా నడుస్తోంది. కామెడీ సినిమాలు వచ్చినా, కథ ఆధారిత హాస్యం కాకుండా కొన్ని సీన్లకే పరిమితమవుతున్నాయి. గత ఐదారేళ్లుగా నాకు కథ ఆధారిత కామెడీ సినిమా చేయాలనే కోరిక ఉంది. “యశోద” తర్వాత నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌తో మాట్లాడినప్పుడు ఈ ఐడియా చెప్పాను. ఆయనకు నచ్చడంతో ప్రాజెక్ట్ మొదలైంది. అదే సమయంలో ప్రియదర్శి నటించిన “బలగం”, “సేవ్ ద టైగర్స్”, “మెయిల్” చూసి, అతనితో ఈ సినిమా చేయాలని నిర్ణయించాను. 2023 నవంబర్‌లో ప్రీ-ప్రొడక్షన్ మొదలై, 2024 మార్చిలో షూటింగ్ ప్రారంభించాము.

ప్రశ్న: “సారంగపాణి జాతకం” ఎలాంటి అనుభవాన్ని అందిస్తుంది?
ఇంద్రగంటి: ఇది పూర్తిస్థాయి లైట్-హార్టెడ్ కామెడీ చిత్రం. సాధారణ కామెడీ సినిమాల్లో కొంతమంది కమెడియన్లు ఉంటారు, కానీ ఇందులో ప్రతి నటుడూ కొత్త పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు అక్కడితో ఆనందం మర్చిపోకుండా, నాలుగైదు రోజులపాటు పాత్రలు, డైలాగ్‌ల గురించి మాట్లాడుకునేలా ఉంటుంది. నాకు చాలా తృప్తినిచ్చిన సినిమా ఇది. టెక్నికల్‌గా, బడ్జెట్‌పరంగా దాదాపు అనుకున్నట్లుగా తీయగలిగాను. మంచి నటులు, సాంకేతిక బృందం అందడంతో ఈ సినిమా నాకు చాలా సంతోషాన్నిచ్చింది.

ప్రశ్న: సినిమాలో జాతకం కీలక అంశం. మీరు జాతకాలను ఎంతవరకు నమ్ముతారు? ఈ సబ్జెక్ట్ కోసం ఏం రీసెర్చ్ చేశారు?
ఇంద్రగంటి: జాతకాల విషయంలో నేను మధ్యేమార్గంలో ఉన్నాను. కొన్ని జాతక ఊహాగానాలు నిజమయ్యాయి, కొన్ని కాదు. ఉదాహరణకు, 2015లో ఓ స్నేహితుడు నా చేతిరేఖలు చూసి 2016లో ప్రమాదం జరగొచ్చని హెచ్చరించాడు. అదే సమయంలో నాకు యాక్సిడెంట్ జరిగింది. అలాగే, నా 32 ఏళ్ల వయసులోనే తొలి సినిమా తీస్తానని ఓ జ్యోతిష్కుడు చెప్పాడు, అది కూడా నిజమైంది. కానీ అన్నీ జరగలేదు. కాబట్టి, జాతకాలను పూర్తిగా నమ్మడం లేదా తోసిపుచ్చడం లేదు, ఇంకా రీసెర్చ్ లో ఉన్నాను. ఈ సినిమా కోసం జాతకాలపై ప్రత్యేక రీసెర్చ్ చేయలేదు, కానీ నమ్మకాలు మూఢనమ్మకాలుగా మారితే మనిషిని బలహీనం చేస్తాయనే ఆలోచన ఈ కథలో చూపించాము. నమ్మకం బలాన్నివ్వాలి, పిచ్చిగా మార్చకూడదు. ఈ సందేశాన్ని కామెడీ రూపంలో సునిశితంగా చెప్పాము.

ప్రశ్న: సినిమా ఎందుకు చూడాలి?
ఇంద్రగంటి: “సారంగపాణి జాతకం” ఒక అస్ట్రాలజికల్ క్రైమ్ కామెడీ, ఇందులో హింస లేకపోయినా ఒక క్రిమినల్ ఎలిమెంట్‌తో కామెడీ జనరేట్ అవుతుంది. ఇటీవలి కాలంలో యాక్షన్, హింసాత్మక సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి, కానీ ఇది పూర్తి వినోదభరిత కుటుంబ చిత్రం. అన్ని వయసుల వారు, అన్ని వర్గాల వారు కలిసి ఆనందించే ఈ సినిమా, థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు నవ్వులు పంచుతుంది.

ప్రశ్న: శివలెంక కృష్ణప్రసాద్‌ సహకారం?
ఇంద్రగంటి: శ్రీదేవీ మూవీస్‌తో ఇది మూడో చిత్రం. గతంలో “జెంటిల్‌మన్”, “సమ్మోహనం” విజయవంతమయ్యాయి. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సినిమా పట్ల అభిరుచి, సహకారం వల్ల నేను అనుకున్నట్లు సినిమాను తీయగలిగాను. ఈ సినిమా తర్వాత నాకు ఎలాంటి అసంతృప్తి లేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Indragnti Mohana Krishna Interview
  • Sarangapani Jatakam

తాజావార్తలు

  • IPL 2026 New Rules: మ్యాచ్ డే ప్రాక్టీస్ బ్యాన్.. ఐపీఎల్ 2026కి బీసీసీఐ కొత్త నిబంధనలు

  • Akshay Kumar: “అది ఒక అడల్ట్ సినిమా”.. ధురంధర్-2పై అక్షయ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

  • Anushka Sharma-Tollywood: అనుష్క శర్మ టాలీవుడ్ ఎంట్రీ.. కట్ చేస్తే.. !

  • Toyota Land Cruiser FJ: టయోటా అత్యంత చౌకైన ల్యాండ్ క్రూయిజర్ FJ విడుదల.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే?

  • Supreme Court: మతం మారితే ఎస్సీ హక్కులు వర్తించవు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions