Indragnti Mohana Krishna: నమ్మకాలు మూఢనమ్మకాలుగా మారితే.. “సారంగపాణి జాతకం”: ఇంద్రగంటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెర్సటైల్ స్టార్ ప్రియదర్శి టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం “సారంగపాణి జాతకం”, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించిన హాస్యప్రధాన చిత్రం. “జెంటిల్‌మన్”, “సమ్మోహనం” వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత ఇంద్రగంటి మరియు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో తెరకెక్కిన ఈ సినిమా, ఏప్రిల్ 25, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రంలో హీరోయిన్‌గా రూపా కొడవాయూర్ నటించగా, వెన్నెల కిషోర్, వైవా హర్ష, అవసరాల శ్రీనివాస్, సాయి శ్రీనివాస్ వడ్లమాని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాటోగ్రఫీ పీజీ విందా, సంగీతం వివేక్ సాగర్, ఎడిటింగ్ వెంకటేశ్ కే మార్తాండ్ నిర్వహించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు ఇంద్రగంటి మీడియాతో మాట్లాడారు.
ప్రశ్న: చాలా రోజుల తర్వాత జంధ్యాల, ఈవీవీ గారి తరహాలో పూర్తి వినోదాత్మక చిత్రం తీస్తున్నారు. ఈ ఆలోచన ఎలా వచ్చింది?
ఇంద్రగంటి: ఒకప్పుడు తెలుగులో సంవత్సరానికి ఐదారు కామెడీ చిత్రాలు వచ్చేవి. ఇప్పుడు యాక్షన్ సినిమాల హవా నడుస్తోంది. కామెడీ సినిమాలు వచ్చినా, కథ ఆధారిత హాస్యం కాకుండా కొన్ని సీన్లకే పరిమితమవుతున్నాయి. గత ఐదారేళ్లుగా నాకు కథ ఆధారిత కామెడీ సినిమా చేయాలనే కోరిక ఉంది. “యశోద” తర్వాత నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌తో మాట్లాడినప్పుడు ఈ ఐడియా చెప్పాను. ఆయనకు నచ్చడంతో ప్రాజెక్ట్ మొదలైంది. అదే సమయంలో ప్రియదర్శి నటించిన “బలగం”, “సేవ్ ద టైగర్స్”, “మెయిల్” చూసి, అతనితో ఈ సినిమా చేయాలని నిర్ణయించాను. 2023 నవంబర్‌లో ప్రీ-ప్రొడక్షన్ మొదలై, 2024 మార్చిలో షూటింగ్ ప్రారంభించాము.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ప్రశ్న: “సారంగపాణి జాతకం” ఎలాంటి అనుభవాన్ని అందిస్తుంది?
ఇంద్రగంటి: ఇది పూర్తిస్థాయి లైట్-హార్టెడ్ కామెడీ చిత్రం. సాధారణ కామెడీ సినిమాల్లో కొంతమంది కమెడియన్లు ఉంటారు, కానీ ఇందులో ప్రతి నటుడూ కొత్త పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు అక్కడితో ఆనందం మర్చిపోకుండా, నాలుగైదు రోజులపాటు పాత్రలు, డైలాగ్‌ల గురించి మాట్లాడుకునేలా ఉంటుంది. నాకు చాలా తృప్తినిచ్చిన సినిమా ఇది. టెక్నికల్‌గా, బడ్జెట్‌పరంగా దాదాపు అనుకున్నట్లుగా తీయగలిగాను. మంచి నటులు, సాంకేతిక బృందం అందడంతో ఈ సినిమా నాకు చాలా సంతోషాన్నిచ్చింది.
ప్రశ్న: సినిమాలో జాతకం కీలక అంశం. మీరు జాతకాలను ఎంతవరకు నమ్ముతారు? ఈ సబ్జెక్ట్ కోసం ఏం రీసెర్చ్ చేశారు?
ఇంద్రగంటి: జాతకాల విషయంలో నేను మధ్యేమార్గంలో ఉన్నాను. కొన్ని జాతక ఊహాగానాలు నిజమయ్యాయి, కొన్ని కాదు. ఉదాహరణకు, 2015లో ఓ స్నేహితుడు నా చేతిరేఖలు చూసి 2016లో ప్రమాదం జరగొచ్చని హెచ్చరించాడు. అదే సమయంలో నాకు యాక్సిడెంట్ జరిగింది. అలాగే, నా 32 ఏళ్ల వయసులోనే తొలి సినిమా తీస్తానని ఓ జ్యోతిష్కుడు చెప్పాడు, అది కూడా నిజమైంది. కానీ అన్నీ జరగలేదు. కాబట్టి, జాతకాలను పూర్తిగా నమ్మడం లేదా తోసిపుచ్చడం లేదు, ఇంకా రీసెర్చ్ లో ఉన్నాను. ఈ సినిమా కోసం జాతకాలపై ప్రత్యేక రీసెర్చ్ చేయలేదు, కానీ నమ్మకాలు మూఢనమ్మకాలుగా మారితే మనిషిని బలహీనం చేస్తాయనే ఆలోచన ఈ కథలో చూపించాము. నమ్మకం బలాన్నివ్వాలి, పిచ్చిగా మార్చకూడదు. ఈ సందేశాన్ని కామెడీ రూపంలో సునిశితంగా చెప్పాము.
ప్రశ్న: సినిమా ఎందుకు చూడాలి?
ఇంద్రగంటి: “సారంగపాణి జాతకం” ఒక అస్ట్రాలజికల్ క్రైమ్ కామెడీ, ఇందులో హింస లేకపోయినా ఒక క్రిమినల్ ఎలిమెంట్‌తో కామెడీ జనరేట్ అవుతుంది. ఇటీవలి కాలంలో యాక్షన్, హింసాత్మక సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి, కానీ ఇది పూర్తి వినోదభరిత కుటుంబ చిత్రం. అన్ని వయసుల వారు, అన్ని వర్గాల వారు కలిసి ఆనందించే ఈ సినిమా, థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు నవ్వులు పంచుతుంది.
ప్రశ్న: శివలెంక కృష్ణప్రసాద్ సహకారం?
ఇంద్రగంటి: శ్రీదేవీ మూవీస్‌తో ఇది మూడో చిత్రం. గతంలో “జెంటిల్‌మన్”, “సమ్మోహనం” విజయవంతమయ్యాయి. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సినిమా పట్ల అభిరుచి, సహకారం వల్ల నేను అనుకున్నట్లు సినిమాను తీయగలిగాను. ఈ సినిమా తర్వాత నాకు ఎలాంటి అసంతృప్తి లేదు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?