Director Bobby : మోక్షజ్ఞ దొరికితే ఎందుకు వదులుతాను..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్నేళ్లుగా బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులకు ఎట్టకేలకు ఈ ఏడాదిలో మోక్షు హీరోగా లాంచ్ అవనున్నాడనే గుడ్ న్యూస్ చెప్పి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. హనుమాన్‌తో పాన్ ఇండియా హిట్ కొట్టిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు మోక్షజ్ఙను లాంచ్ చేసే బాధ్యతను అప్పగించాడు బాలయ్య. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇచ్చింది. ఇదే జోష్‌లో షూటింగ్‌కు రెడీ అయ్యారు.
Also Read : AlluArjun : పుష్ప – 2 దాటికి తట్టుకోలేకపోయిన ‘బేబీ జాన్’
Also Read
కానీ ఏమైందో ఏమో గానీ ఈ సినిమా పూజా కార్యక్రమం మాత్రం బ్రేక్ పడింది. దీంతో ఈ ప్రాజెక్టే ఆగిపోయిందా అనే సందేహాలు ఉన్నాయి. కానీ మోక్షు దొరికితే మాత్రం వదలని చెబుతున్నాడు మాస్ డైరెక్టర్ బాబీ. బాలకృష్ణ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘డాకు మహారాజ్’కు బాబీ దర్శకత్వం వహించిస సంగతి తెలిసిందే. 2025 సంక్రాంతికి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో డాకు మహారాజ్ ప్రమోషన్స్‌లో భాగంగా మోక్షజ్ఞపై బాబీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్య్వూలో బాబీ మాట్లాడుతూ మోక్షజ్ఞ ఓ నాలుగు సార్లు డాకు మహారాజ్‌కి సినిమా సెట్‌కి వచ్చాడు. అతన్ని చూస్తే ఆరడుగులు, చాలా షార్ప్ ఫ్యూచర్స్, చాలా ఒదిగి ఉంటాడు, చాలా నేర్చుకోవాలనే తపన ఉంటుందని అనిపిస్తుంది. ఒక డైరెక్టర్‌గా ఇలాంటి కుర్రాడు మనకి దొరికితే బాగుంటుందని అనిపిస్తుంది. అతనితో సినిమా తీయాలనే ఆశ ఉంటుంది, తీసే ఛాన్స్ వస్తే ఎవరూ వద్దనుకోరు. మన పని మనం చేసుకుంటూ వెళ్లడమే. ఛాన్స్ అదే వస్తుంది అని అన్నారు. మరి ఫ్యూచర్లో అయినా మోక్షుతో బాబీ సినిమా చేస్తాడేమో చూడాలి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!