Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా పిచ్చితో అవకాశాల కోసం ఎన్నో ఏళ్లు పోరాడిన ఒక సాధారణ యువకుడి కల నెరవేరితే ఆ ఆనందం ఎలా ఉంటుందో ‘హుషార్ పిట్టలు’ మూవీ ప్రెస్ మీట్లో ప్రత్యక్షంగా కనిపించింది. ఈ సినిమాలో ‘పుట్ట భాను’గా నటించిన నటుడు భాను, మొదటిసారి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలు ప్రెస్ మీట్లో అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఇది కలా నిజమో అర్ధం కావడం లేదంటూ అతను పొట్టు పొట్టున తన చెంప మీద కొట్టుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. ఈవెంట్లో భాను మాట్లాడుతూ, “నాకు చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి ఎక్కువ. ఊర్లో ఏ సినిమా పడ్డా ఫస్ట్ షో థియేటర్లో వాలిపోయేవాడిని. స్క్రీన్ మీద కామెడీ చూసి నవ్వుకునే నేను, మొన్న ‘హుషార్ పిట్టలు’ ప్రివ్యూ చూస్తున్నప్పుడు పెద్ద స్క్రీన్ మీద నన్ను చూసి కింద జనాలు నవ్వుతుంటే కళ్లంబడి నీళ్లు తిరిగాయి. అసలు ఇది కలనా, నిజమా అనేది ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఎన్ని కష్టాలు, అవమానాలు ఎదురైనా నటుడిగా నిరూపించుకోవాలనే పట్టుదలతోనే ఇన్నాళ్లూ ఉన్నాను” అని ఎమోషనల్ అయ్యారు.
సినిమా అవకాశాల కోసం తాను పడిన తపనను పంచుకుంటూ, “చాన్స్ రావాలని బోయిన్ పల్లి ఎల్లమ్మ తల్లికి మొక్కుకుని, ప్రతి మంగళవారం చెప్పులు కూడా వేసుకోకుండా తిరిగాను. అవకాశం వచ్చి సినిమా రిలీజ్ అయ్యాక దేవుడికి 100 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నా. కానీ నన్ను ఒక నటుడిగా నిలబెట్టి, ఇంత మంచి పాత్ర ఇచ్చి కొత్త జీవితాన్ని ప్రసాదించిన మా డైరెక్టర్ భిక్ష అన్న, ప్రొడ్యూసర్ వెంకట్ యాదవ్ అన్నల రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. అందుకే అమ్మవారితో పాటు, నాకు లైఫ్ ఇచ్చిన వీళ్లకు కూడా ప్రత్యేకంగా 100 కొబ్బరికాయలు కొడతాను” అని భాను కృతజ్ఞతలు తెలిపారు. చిన్న క్యారెక్టర్ అనుకుంటే తనకు ఎంతో ప్రాధాన్యత ఉన్న మంచి పాత్ర ఇచ్చినందుకు చిత్ర యూనిట్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. భాను మాట్లాడిన ఈ నిష్కల్మషమైన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
Also Read
- Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
- Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
- Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'సైయారా' జోడి
- Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
తాజావార్తలు
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!