Hreem: కర్ణపిశాచి కథ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న “హ్రీం” టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ తాతా, చమింద వర్మ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న మిస్టికల్ హారర్ థ్రిల్లర్ హ్రీం. ఈ సినిమాను శ్రీమతి సుజాత మల్లాల సమర్పణలో శివ మల్లాల నిర్మిస్తున్నారు. రాజేష్ రావూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా అఫీషియల్ టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగింది. టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ చిత్ర టీజర్‌ను లాంచ్ చేశారు.
నిర్మాత శివ మల్లాల మాట్లాడుతూ తన 25 ఏళ్ల జర్నలిజం ప్రయాణం తర్వాత ప్రొడ్యూసర్‌గా మారడం వెనుక ఉన్న కష్టాన్ని, ప్యాషన్‌ను పంచుకున్నారు. “డైరెక్టర్ రాజేష్ నాకు ‘కర్ణపిశాచి’ అనే అద్భుతమైన కోర్ పాయింట్ ఉన్న కథ చెప్పాడు. బడ్జెట్ పరిమితుల్లోనే గెరిల్లా టైప్ షూటింగ్ స్టైల్లో అదిరిపోయే అవుట్‌పుట్ తెచ్చాం. వరంగల్ దగ్గర పెద పెండ్యాల అనే ఊరిలో గ్రామస్తుల సహకారంతో షూటింగ్ పూర్తి చేశాం. ఈ సినిమాలో దాదాపు 20 నిమిషాల పాటు హై-లెవెల్ గ్రాఫిక్స్ (VFX) ఉండబోతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ చమింద వర్మ దుబాయ్ నుంచి వచ్చి, కథను నమ్మి రూపాయి కూడా రెమ్యూనరేషన్ ఆశించకుండా ఎంతో తపనతో నటించింది” అంటూ శివ మల్లాల ఎమోషనల్ అయ్యారు. అలాగే జర్నలిస్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న హీరో పవన్ తాతా షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి ఈ ఛాలెంజింగ్ రోల్‌ను అద్భుతంగా క్యారీ చేశాడని నిర్మాత ప్రశంసించారు. తనికెళ్ల భరణి, భద్రమ్, రాజశేఖర్ (శుభోదయం సుబ్బారావు) తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అరవింద్ సినిమాటోగ్రఫీ అందించగా, రాజ్ పవన్ వీఎఫ్ఎక్స్ బాధ్యతలు నిర్వహించారు. త్వరలోనే ఈ మైండ్ బ్లోయింగ్ హారర్ థ్రిల్లర్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు.
Also Read
- Toxic Censor Report: 'టాక్సిక్'కు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చిందా.?
- Irumudi Day 1 Collections: థియేటర్లలో రవితేజ ‘ఇరుముడి’ కలెక్షన్స్ సునామీ.. ఓటీటీ రిలీజ్‌పై అదిరిపోయే అప్డేట్!
- Mookuthi Amman 2: అమ్మోరు పాత్రలో మళ్లీ నయనతార… ఫాంటసీ ఎంటర్టైనర్ కి భారీ ఓటీటీ డీల్?
- Mega 158 : సంక్రాంతికి రెండు గెటప్పుల్లో మెగాస్టార్ విధ్వంసం: 'కాకా' టైటిల్ గ్లింప్స్‌తో పూనకాలు!
తాజావార్తలు
-
Toxic Censor Report: ‘టాక్సిక్’కు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చిందా.?
-
Gachibowli Bike Accident: గచ్చిబౌలిలో ఘోరం.. బైక్ ప్రమాదంలో ఐటీ ఉద్యోగి మృతి..
-
Irumudi Day 1 Collections: థియేటర్లలో రవితేజ ‘ఇరుముడి’ కలెక్షన్స్ సునామీ.. ఓటీటీ రిలీజ్‌పై అదిరిపోయే అప్డేట్!
-
Canada-US Trade Talks Collapse: కెనడా-అమెరికా మధ్య మళ్లీ ట్రేడ్ వార్?.. కెనడాపై 50% టారిఫ్‌ల ముప్పు
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 31 నుంచే ప్రారంభం..
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?