‘హౌస్ ఫుల్’ మూవీ సిరీస్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ సిరీస్‌గా క్రేజ్ సంపాదించుకున్న ఈ మూవీ నుంచి రీసెంట్ గా ఫిప్త్ పార్ట్ కూడా జూన్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రితేష్ దేశ్ ముఖ్, అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను తరుణ్ మన్ సుఖానీ తెరకెక్కించగా,సాజిద్ నడియావాలా గ్రాండ్‌గా నిర్మించారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనమ్ బజ్వా, నర్గీస్ ఫక్రీ, సంజయ్ దత్, జాకీష్రాఫ్, నానాపటేకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ టాక్ విషయానికి వస్తే..
Also Read : Nithin : ‘తమ్ముడు’ మూవీ నుంచి ఆకట్టుకుంటున్న సప్తమి గౌడ లుక్ ..
‘ఫన్ ఎలిమెంట్స్ తో సాగిన, క్రైమ్ కమ్ మర్డర్ మిస్టరీ మూవీ’ అని అంతా రివ్యూస్ ఇస్తున్నారు. అక్షయ్ కుమార్, అభిషేక్, ఫర్దీన్ ఖాన్ పాత్రలు సినిమాకు ప్లస్ పాయింట్స్ అని. హౌస్ ఫుల్ 5 లో ఫ్యాన్స్ కు నచ్చే అంశాలు ఉన్నాయన్నారు. టెక్నికల్ అంశాలు కూడా కథకు సరిపడేలా ఉన్నాయని తెలిపారు. ఇదిలా ఉంటే నార్మాల్‌గా హీరోలు వారి సినియా రిలీజ్ అయినప్పుడు థియేటర్ లోపలికి వచ్చి ఫ్యాన్స్‌కు సప్రైజ్ ఇస్తుంటారు. కానీ తాజాగా అక్షయ్ కుమార్ చేసిన పనికి అంతా షాక్ అవుతున్నారు. అసలు ఏం జరిగింది అంటే.. తాజాగా ‘హౌస్ ఫుల్’ మూవీ థీయెటర్ వద్ద అక్షయ్ మాస్క్ వేసుకుని.. సినిమా చూసి వస్తున్న ప్రేక్షకులను రివ్వూ అడుగుతూ కనిపించాడు. ప్రజంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలాంటి పని ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో కూడా చేయలేదు.