Site icon NTV Telugu

Hombale Films : అరుదైన ఘనత సాధించిన హోంబాలే ఫిలింస్

Hombale Films

Hombale Films

కర్ణాటక బేస్డ్ ప్రొడక్షన్ కంపెనీ అంబానీ ఫిలిం వరుస సినిమాలు చేస్తూ బ్లాక్‌బస్టర్లు కొడుతోంది. కేజిఎఫ్ చాప్టర్ వన్ సినిమాతో ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ సంస్థ, ఆ తర్వాత ఏమాత్రం వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత కేజిఎఫ్ చాప్టర్ టూ, కాంతారా, సలార్ సినిమాలతో బ్లాక్‌బస్టర్లు కొట్టిన ఈ సంస్థ, ప్రజెంట్ చేసిన మహా అవతార్ నరసింహతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమా ఏకంగా 300 కోట్లు కలెక్షన్స్ సాధించి, ఈ ప్రొడక్షన్ హౌస్‌కి అరుదైన ఘనత సాధించేలా చేసింది. ఈ రోజుల్లో ఒక్క పాన్ ఇండియా హిట్టు కొట్టడమే గగనం అయిపోతున్న తరుణంలో, ఏకంగా ఐదు పాన్ ఇండియా సినిమాలు, అది కూడా వరుసగా హిట్లు కొట్టడం అనేది మామూలు విషయం కాదు.

Also Read : Perni Nani: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి ఫైర్!

ఏడేళ్ల వ్యవధిలో ఈ ఐదు బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న సినిమా సంస్థగా హోమ్‌బాలే ఫిలిమ్స్ ఇప్పుడు అవతరించింది. కేజిఎఫ్ చాప్టర్ వన్ మొదలు మొన్న వచ్చిన మహావతార నరసింహ సినిమా వరకు, అన్ని సినిమాలు మంచి లాభాలు తెచ్చిపెట్టాయని చెప్పాలి. ఇక ఇదే సంస్థ నుంచి కాంతారా చాప్టర్ వన్ ఈ ఏడాది రాబోతోంది. అక్టోబర్‌లో దసరా సందర్భంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా 1000 కోట్లు సాధించే అవకాశం ఉందని అంచనాలున్నాయి. ఈ సినిమా తర్వాత కూడా హోమ్‌బాలే సంస్థ లైన్‌లో మంచి యాంటిసిపేటెడ్ సినిమాలు ఉన్నాయి.

Exit mobile version