Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమాల్లో లేదా వెబ్ సిరీస్‌లలో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే హాట్ అండ్ బోల్డ్ రొమాంటిక్ సీన్స్ చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతుంటారు. కెమెరా ముందు నటీనటులు అంత ప్యాషనేట్‌గా ఎలా ఇన్వాల్వ్ అవుతారా అని సగటు ప్రేక్షకుడికి ఎప్పుడూ ఒక సందేహం ఉంటుంది. అయితే, ఆ సీన్లలో మీరు చూసేది కేవలం కెమెరా మాయాజాలం మాత్రమేనని, వాస్తవానికి అక్కడ జరిగేది వేరని నెట్‌ఫ్లిక్స్ ‘సెక్స్/లైఫ్’ సిరీస్ ఫేమ్, హాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా షాహి (Sarah Shahi) ఓ సంచలన నిజాన్ని బయటపెట్టారు. నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన ‘సెక్స్/లైఫ్’ సిరీస్‌లో సారా షాహి ఎంతటి బోల్డ్ సీన్లలో నటించిందో అందరికీ తెలిసిందే. ఆ సిరీస్ అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఓ ఊపు ఊపేసింది. అయితే, రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సారా.. ఇంటిమేట్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నటీనటుల మధ్య వాస్తవానికి ఏం జరుగుతుందో పూసగుచ్చినట్లు వివరించి అందరి మైండ్ బ్లాంక్ చేసింది.
బెడ్రూమ్ సన్నివేశాల్లో ఒకరి శరీరాలు మరొకరికి తగలకుండా, నటీనటులు మానసికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు హాలీవుడ్ మేకర్స్ ఒక వినూత్నమైన ట్రిక్ వాడుతున్నారని సారా తెలిపింది. “ఇంటిమేట్ సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు, హీరో హీరోయిన్ల మధ్య గాలి తీసేసిన ఒక చిన్న ప్లాస్టిక్ ‘యోగా బాల్’ను (Yoga Ball) ఉంచుతారు. కెమెరా యాక్షన్ చెప్పగానే ఎదుటి నటుడు ఆ సీన్లో ఇన్వాల్వ్ అవుతాడు, కానీ అతను వాస్తవానికి ఆ యోగా బాల్‌ను మాత్రమే టచ్ చేస్తాడు. ఆ సమయంలో నాకు కేవలం ఆ బాల్ ఇంపాక్ట్ మాత్రమే తెలుస్తుంది తప్ప, ఆ నటుడి శరీరం నాకు ఏమాత్రం తగలదు” అంటూ సారా అసలు సీక్రెట్ లీక్ చేసింది. ఈ పద్ధతి వల్ల నటీనటులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆమె స్పష్టం చేసింది. “కెమెరా ముందు నటించే సమయంలో మనకు ఇష్టం లేని శారీరక స్పర్శలను అనుభవించాల్సిన అవసరం రాదు. ఇద్దరి మధ్య ఒక బాల్ ఉండటం వల్ల చాలా స్వేచ్ఛగా, ఎవరి పరిమితుల్లో వాళ్ళు ఉంటూనే చాలా సేఫ్‌గా నటించడానికి ఈ ట్రిక్ ఎంతో ఉపయోగపడుతుంది. తెరపై చూసే ప్రేక్షకులకు మాత్రం మేం నిజంగానే రొమాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది, అదంతా పక్కా ప్రొఫెషనలిజం” అని ఆమె చెప్పుకొచ్చారు.
Also Read
తాజావార్తలు
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!